దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఓపెనర్ మహ్మద్ షెజాద్ (56; 43 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్లతో భారత యువ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 37 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ఈ టోర్నీలో అతడికిది వరుసగా రెండో అర్ధశతకం కావడం విశేషం. అయితే కౌల్ వేసిన 8వ ఓవర్లో అంబటి రాయుడు క్యాచ్ మిస్ చేయడంతో అతడికి లైఫ్ దొరికింది.
దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి అఫ్గాన్ 63 పరుగులు చేసింది. వీటిలో షెజాద్‌వే 60 పరుగులు ఉండటం గమనార్హం. అనంతరం భారత స్పిన్నర్ జడేజా అప్గాన్ పనిపట్టాడు. అద్భుత బంతితో జావెద్ అహ్మది (5) బోల్తాకొట్టించాడు. ధోని మార్క్ కీపింగ్‌తో జావెద్ పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రెహ్మత్ షా (3)ను సైతం జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు.
హ్యాట్రిక్ మిస్.. ఆ వెంటనే కుల్దీప్ అటాక్ చేయడంతో అఫ్గాన్ హస్మతుల్లా(0), కెప్టెన్ అస్గర్(0) వికెట్లను వరుసగా కోల్పోయింది. ఇక కుల్దీప్ హ్యాట్రిక్ ఛాన్స్ మిస్సయ్యింది. 17 పరుగుల వ్యవదిలోనే అఫ్గాన్ నాలుగు వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో భారత్‌కు మహేంద్రసింగ్ ధోని సారథిగా వ్యవహరిస్తుండటం విశేషం. మరోవైపు షెజాద్ దాటిగా ఆడుతూ సెంచరీ చేరువగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment