
సాక్షి, ముంబై: టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. భార్య హసీన్ జహాన్‌తో గొడవలకుతోడు గాయాలతోనూ సతమతం అవుతోన్న షమీని అఫ్గనిస్తాన్ టెస్టు నుంచి తొలగించారు. ఫిట్‌నెస్ నిరూపించుకోవడంలో విఫలమైన కారణంగా అఫ్గాన్‌తో టెస్టు నుంచి షమీని తప్పిస్తున్నట్లు బీసీసీఐ సోమవారం ప్రకటించింది. షమీ స్థానంలో ఢిల్లీకి చెందిన ఆల్‌రౌండర్ నవదీప్ సైనీని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందని బోర్డు తెలిపింది. మొన్నటి ఐపీఎల్‌లో సైనీ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరుఫున ఆడిన సంగతి తెలిసిందే.
భార్యతో విబేధాలు తారాస్థాయికి: మహ్మద్ షమీ, ఆయన భార్య హసీన్ జహాన్‌ల మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి. రంజాన్ తర్వాత షమీ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని జహాన్ ఆరోపించిగా, ‘ఒక్క పెళ్లి చేసుకొనే నానా ఇబ్బందులు పడుతుంటే.. రెండో పెళ్లా? మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా? అని షమీ సోషల్ మీడియాలో బదులిచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment