లండన్: ఇప్పటికే ఎన్నో రికార్డులను నెలకొల్పిన టీమిండియా మాజీ కెప్టెన్, పరిమిత ఓవర్ల రెగ్యులర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని మరో మైలురాయిని చేరుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో మూడొందల క్యాచ్‌లు పట్టిన తొలి టీమిండియా వికెట్ కీపర్‌గా ధోని కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో ధోని ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఉమేశ్ యాదవ్ వేసిన 37వ ఓవర్‌లో జాస్ బట్లర్ క్యాచ్ పట్టి వన్డేల్లో మూడొందల క్యాచ్‌ల మార్కును చేరాడు. ఇది ధోనికి 320వ వన్డే.
ఈ మ్యాచ్‌కు ముందు మూడొందల క్యాచ్‌లకు రెండు క్యాచ్‌లు దూరంలో ఉన్న ధోని.. తాజా మ్యాచ్‌లో బెన్ స్టోక్స్, బట్లర్ క్యాచ్‌లను అందుకుని అరుదైన ఘనతను సాధించాడు. ఓవరాల్‌గా ఈ ఘనతెక్కిన నాలుగో వికెట్ కీపర్‌గా ధోని నిలిచాడు. గిల్‌క్రిస్ట్ (417), బౌచర్ (403), సంగక్కర (402) ముందు వరుసలో ఉండగా, ఆ తర్వాత స్థానాన్ని ధోని ఆక్రమించాడు.
Comments
Please login to add a commentAdd a comment