‘భారత్ పటిష్టంగా ఉంది’
పెర్త్: ప్రపంచకప్‌లో దూసుకెళుతున్న భారత క్రికెట్ జట్టును విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ ప్రశంసించారు. ఓపెనర్ ధావన్ ఫామ్, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి నిలకడైన బ్యాటింగ్‌తో ధోని సేన అదరగొడుతోందని, అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్ర వేస్తోందని అన్నారు. ‘భారత పేసర్లు ఆకట్టుకుంటున్నారు. బ్యాటింగ్‌లో మిడిలార్డర్‌లో చక్కటి సమన్వయం ఉంది.
రెండేళ్ల నుంచి కోహ్లి బ్యాటింగ్ అద్భుతంగా సాగుతోంది. తాజాగా ధావన్ ఫామ్‌లోకొచ్చాడు. ఇక ధోని చివర్లో మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు. ఓవరాల్‌గా భారత్ ఆల్‌రౌండ్ షో కనబరుస్తోంది. అయితే శుక్రవారం విండీస్‌తో మ్యాచ్ సందర్భంగా వారు మెరుగ్గా ఆడకూడదనే అనుకుంటున్నాను’ అని లాయిడ్ అన్నారు.