
ముంబై:ఇటీవల శ్రీలంకతో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. చివరిదైన మూడో టీ 20లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. కాగా, మూడో టీ 20 తరువాత శ్రీలంక కీలక ఆటగాళ్లకు ఎంఎస్ ధోని కోచింగ్ పాఠాలు నేర్పాడు.
బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమంలో భాగంగా లంక కెప్టెన్ తిషారా పెరీరాను వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో పలువురు లంక ఆటగాళ్లు ధోని దగ్గరకు చేరారు. అదే సమయంలో ధోని నుంచి సలహాలు తీసుకున్నారు. ఇలా సలహాలు తీసుకున్న వారిలో శ్రీలంక సీనియర్ ఆటగాడు ఉపుల్ తరంగాతో పాటు యువ ఆటగాళ్లు అకిల దనంజయ, సమరవిక్రమలు ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment