దుబాయ్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరో రికార్డు సాధించాడు. ఇప్పటికే టీమిండియా తరఫున అత్యుత్తమ కెప్టెన్‌గా, గొప్ప ఫినిషర్‌గా ఖ్యాతి సాధించిన ఎంఎస్ ధోని.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మందిని పెవిలియన్‌కు పంపిన తొలి ఆసియా వికెట్ కీపర్‌గా రికార్డు సాధించాడు.
శుక్రవారం భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఆసియాకప్ ఫైనల్‌లో ధోని ఈ రికార్డు సాధించాడు. టాస్ గెలిచిన రోహిత్ సేన తొలుత బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌ను ఆహ్వానించింది. తొలి ఇన్నింగ్స్ 43వ ఓవర్‌లో కుల్‌దీప్ యాదవ్ వేసిన ఐదో బంతికి బంగ్లా కెప్టెన్ మొర్తజా స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. కుల్‌దీప్ వేసిన బంతిని మొర్తజా ఎదుర్కొనేందుకు ప్రయత్నించగా అది కాస్తా ధోని చేతికి చిక్కింది. వెంటనే ధోనీ బంతిని వికెట్లకు కొట్టడంతో మోర్తజా స్టంప్ అవుట్ అయ్యాడు. దాంతో 800 మంది డిస్మిసల్స్‌లో ధోని భాగస్వామ్యమ్యాడు.
ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో అత్యధిక ఔట్లలో పాలు పంచుకున్నతొలి ఆసియా వికెట్ కీపర్‌గా ధోని అరుదైన ఘనత సాధించాడు. ఇక్కడ ఓవరాల్‌గా మార్క్ బౌచర్ (998-దక్షిణాఫ్రికా), గిల్‌క్రిస్ట్ (905-ఆస్ట్రేలియా) తొలి రెండు స్థానాల్లో ఉండగా, ధోని మూడో స్థానంలో ఉన్నాడు. ధోని చేసిన ఔట్లలో 616 క్యాచ్‌లు ఉండగా, 184 స్టంపింగ్స్ ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో స్టంపింగ్స్‌లో ధోని ప్రథమ స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment