ఎంఎస్‌ ధోని.. మరో మూడు రికార్డులు | MS Dhoni Notches up 3 Records in Cuttack Win | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌ ధోని.. మరో మూడు రికార్డులు

Published Thu, Dec 21 2017 2:35 PM | Last Updated on Fri, Nov 9 2018 6:46 PM

MS Dhoni Notches up 3 Records in Cuttack Win - Sakshi

కటక్‌: వన్డేల్లో 300 పైగా మ్యాచ్‌లు.. అత్యధిక నాటౌట్‌లు.. స్టంప్‌ అవుట్‌లతో ఈ ఏడాది రికార్డులు సృష్టించిన టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని..  టీ 20 క్రికెట్‌లో కూడా తనదైన మార్కుతో దూసుకుపోతున్నాడు. శ్రీలంకతో మూడు టీ 20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి వన్డేలో టీమిండియా భారీ విజయంలో పాలుపంచుకున్న ధోని మూడు రికార్డులను నమోదు చేశాడు.  ఒకే మ్యాచ్‌లో 35కు పైగా పరుగులు చేయడంతో పాటు నలుగుర్ని అవుట్‌ చేయడంలో భాగస్వామ్యమైన ధోని ఆ ఘనత సాధించిన తొలి భారత వికెట్‌ కీపర్‌గా రికార్డు పుస్తకాల్లోకికెక్కాడు.  ఓవరాల్‌గా చూస్తే దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ డీకాక్‌, పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్‌ సరసన ధోని నిలిచాడు. నిన్నటి మ్యాచ్‌లో ధోని 39 పరుగులతో అజేయంగా నిలవడంతో పాటు నాలుగు అవుట్లలో భాగమయ్యాడు.

మరొకవైపు ఓవరాల్‌ టీ 20 ఫార్మాట్‌లో 201 అవుట్‌లలో ధోని భాగస్వామ్యమయ్యాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో వికెట్‌ కీపర్‌గా ధోని గుర్తింపు సాధించాడు. ధోని 272 టీ20ల్లో ఈ ఘనత నమోదు చేశాడు. ధోని కంటే ముందు కమ్రాన్‌ అక్మల్‌ ఉన్నాడు. 211 మ్యాచ్‌ల్లో 207 అవుట్లతో అక్మల్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ టీ 20ల పరంగా చూస్తే ధోని 74 అవుట్‌లో భాగస్వామ్యమయ్యాడు. ఇక్కడ ధోని ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉండగా, కమ్రాన్‌ అక్మల్‌(60) రెండో స్థానంలో ఉన్నాడు.

ఇదిలా ఉంచితే, నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన ఘనతను కూడా ధోని సాధించాడు. టీ 20 ఫార్మాట్‌లో నాల్గో స్థానంలో ధోని బ్యాటింగ్‌ స్టైక్‌ రేట్‌ 134.01గా ఉంది. ఈ స్థానంలో 11 ఇన్నింగ్స్‌లు ఆడిన ధోని 244 పరుగులు చేశాడు. ఇందులో ఏడు నాటౌట్లు ఉండటం మరొక విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో ఇంగ్లండ్‌తో టీ 20లో సాధించిన 56 పరుగులతో కలుపుకుని ధోని అత్యుత్తమ స్టైక్‌ రేట్‌ను నమోదు చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement