కేప్‌టౌన్: టీమిండియా సారధిగా ఎన్నో అద్భుత విజయాలను అందించిన ఎంఎస్ ధోని అన్ని ఫార్మెట్ లకు కెప్టెన్ గా గుడ్ బై చెప్పేసి చాలా కాలమే అయ్యింది. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆటగాడిగా మాత్రమే అందుబాటులో ఉన్న ధోని..ఇప్పటికీ జట్టుకు సలహాలు ఇస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం ధోని సూచనలతో జట్టును ముందుకు తీసుకెళుతున్న విషయాన్ని చాలా సందర్భాల్లో స్పష్టం చేశాడు కూడా.
అయితే దక్షిణాఫ్రికాతో ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా కేప్‌టౌన్‌లో జరిగిన మూడో వన్డేలో ధోని ఆద్యంతం ఆటగాళ్లకు సలహాలు ఇవ్వడం మనోడు మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడా అనిపించింది. వికెట్ల వెనుక తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తూనే బౌలర్లను, ఫీల్డర్లను ఎప్పటికప్పుడు సెట్ చేయడం ఇందుకు మరింత ఊతమిచ్చింది. అదే సమయంలో విరాట్ కోహ్లి పెద్దగా భారాన్ని మోయకుండా రిలాక్స్‌డ్‌గా ఫీల్డింగ్ చేసుకోవడం మనకు కనిపించింది. ఒక సందర్భంలో కోహ్లి నువ్వు కొద్దిగా స్టైట్‌గా ఉండు అంటూ ధోని ఫీల్డింగ్ సెట్ చేయడం మొన్నటి మ్యాచ్‌లో కొసమెరుపు. ఇలా ధోని ఫీల్డింగ్ సెట్ చేసే సంభాషణ అంతా బెయిల్స్ కింద ఉండే మైక్‌లో రికార్డు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment