ధోనిపై క్లారిటీ ఇచ్చిన రవిశాస్త్రి | MS Dhoni will play 2019 World Cup, says Ravi Shastri | Sakshi
Sakshi News home page

ధోనిపై క్లారిటీ ఇచ్చిన రవిశాస్త్రి

Published Wed, Sep 13 2017 9:37 PM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM

ధోనిపై క్లారిటీ ఇచ్చిన రవిశాస్త్రి

ధోనిపై క్లారిటీ ఇచ్చిన రవిశాస్త్రి

సాక్షి, న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్‌ ధోని అంతర్జాతీయ కెరీర్‌పై కమ్ముకున్న నీలి నీడలను హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి బుధవారం పటా పంచెలు చేశారు. టీం మేనేజ్‌మెంట్‌ 'ధోనిని తొలగించడం' అనే మాట గురించి ఇప్పటివరకూ ఆలోచించలేదని చెప్పారు. ధోని ప్రస్తుతం ఫామ్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు. 2019 ప్రపంచకప్‌లో ధోని ఆడతారని వెల్లడించారు.

ధోని సాధించిన విజయాల దృష్ట్యా ఆయన్ను గౌరవించాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సునీల్‌ గవాస్కర్‌, సచిన్‌ టెండుల్కర్‌, కపిల్‌ దేవ్‌లతో ధోని పోల్చారు రవిశాస్త్రి. ధోని లాంటి లెజెండ్‌ను ఎక్కడ కనిపెట్టగలమని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement