ICC Cricket World Cup
-
వన్డే వరల్డ్‌కప్ వేదికలు ఖరారు
తదుపరి జరుగబోయే వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన వేదికలు ఖరారైయ్యాయి. 2027 అక్టోబర్, నవంబర్లలో షెడ్యూలైన ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ప్రస్తుతానికి సౌతాఫ్రికాలో జరుగబోయే మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలు ఖరారైయ్యాయి. సౌతాఫ్రికాలో ఐసీసీ గుర్తింపు పొందిన మైదానాలు మొత్తం 11 ఉండగా.. వాటిలో ఎనిమిదింట వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. వాండరర్స్, ప్రిటోరియాలోని సెంచూరియన్ పార్క్, కింగ్స్‌మీడ్, గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్, పార్ల్ అండ్ న్యూలాండ్స్‌లోని బోలాండ్ పార్క్, బ్లూమ్‌ఫోంటెయిన్‌లోని మాంగాంగ్ ఓవల్, తూర్పు లండన్‌లోని బఫెలో పార్క్ మైదానాలు 2027 క్రికెట్ వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. బెనోని, జేబీ మార్క్స్ ఓవల్, డైమండ్ ఓవల్ మైదానాల్లో వసతులు సక్రమంగా లేనందుకు వాటిని పక్కకు పెట్టారు. చాలా అంశాలను (హోటల్స్, ఎయిర్‌పోర్ట్‌లు, స్టేడియం కెపాసిటీ తదితర అంశాలు) పరిగణలోకి తీసుకున్న అనంతరం ఈ ఎనిమిది వేదికలను వరల్డ్‌కప్ మ్యాచ్‌ల కోసం ఎంపిక చేసినట్లు క్రికెట్ సౌతాఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫోలెట్సీ మోసెకీ తెలిపారు. జింబాబ్వే నమీబియాలో జరుగబోయే మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలు త్వరలోనే ఖరారుకానున్నాయి. కాగా, 2027 వరల్డ్‌కప్‌కు ఆతిథ్య దేశాలు దక్షిణాఫ్రికా, జింబాబ్వే నేరుగా అర్హత సాధించగా.. నమీబియా ఆఫ్రికన్ క్వాలిఫైయర్‌ను అధిగమిస్తే అర్హత సాధిస్తుంది. ఈ మెగా టోర్నీకి వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటి ఎనిమిది స్థానాల్లో ఉండే జట్లు నేరుగా అర్హత పొందనుండగా.. మిగిలిన నాలుగు స్థానాలు గ్లోబల్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ల ద్వారా నిర్ణయించబడతాయి. ఈ టోర్నీలో పాల్గొనే 14 జట్లు గ్రూప్‌కు ఏడు చొప్పున రెండు గ్రూపులు విభజించబడతాయి. ప్రతి గ్రూప్ నుండి మొదటి మూడు జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. అనంతరం సెమీఫైనల్స్, ఫైనల్ జరుగుతాయి. 2003 వరల్డ్‌కప్ తరహాలోనే ఈ ప్రపంచకప్‌లోనూ గ్రూప్ దశలో జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. -
బంటీతో రాం...రాం : విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం ?
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో ఓటమి తరువాత టీమిండియా క్రికెటర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్ 2023 ఫైనల్లో భారత్ ఓడిపోయిన మరుసటి రోజే భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ, అతని మేనేజర్ బంటీ సజ్దేహ్ మధ్య దశాబ్ద కాలానిపైగా ఉన్న దీర్ఘకాలిక పార్టనర్‌షిప్‌ను ముగించినట్టు సమాచారం. ఇంత సక్సెస్ఫుల్ భాగస్వామ్యానికి వీడ్కోలు పలకడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే వీరు విడిపోవడానికి గల కారణాలపై స్పష్టత లేదు కానీ కోహ్లినే సొంతంగా రూ.100కోట్ల కంపెనీ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పనులను కూడా ప్రారంహించాడట. రోహిత్ శర్మ, KL రాహుల్, అజింక్యా రహానే, శుభ్‌మన్ గిల్ లాగానే ఇపుడు కోహ్లీ, బంటీ సంబంధం కూడా ముగిసిందని ఇండస్ట్రీ మూలాన్ని ఉటంకిస్తూ క్రికెట్ నెక్స్ట్ పేర్కొంది. క్రికెట్ నెక్ట్స్ నివేదికల ప్రకారం కార్మర్ స్టోన్ వ్యవస్థాపకుడు బంటి సజ్దేహ్ గత పదేళ్లుగా కోహ్లి వ్యాపార కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడు. ప్రధాన క్రికెట్ ఈవెంట్లలో తరచుగా అతని పక్కన ఉంటూ కోహ్లికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచాడు. ముఖ్యంగా కోహ్లి, వాణిజ్య ప్రయోజనాలు, బ్రాండ్ వాల్యూ వంటి అంశాలను బంటీ పర్యవేక్షిస్తుంటారు. పుమా సంస్థతో కోహ్లి వందకోట్ల ఒప్పందంతో పాటు అనేక కీలక ఒప్పందాలు కుదర్చడంలో బంటీదే కీలకపాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి తోడు కార్నర్‌స్టోన్ అటు క్రీడాకారులు, ఇటు బాలీవుడ్ ప్రముఖుల వ్యాపార కార్యకలాపాలనుసైతం నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఇకోహ్లీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటుందనే విమర్శలు ఉన్న ఈ నేపథ్యంలోనే కార్నర్ స్టోన్ నుంచి రోహిత్ శర్మ, కేఎల్ రాహల్, అజింక్యా రహానే, శుభ్‌మన్ గిల్ వంటి క్రీడాకారులు బయటికి వచ్చేశారు. పీవీ సింధు, సానియా మీర్జా, ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్, యశ్ ధుల్ వంటి ప్లేయర్లు ఆ సంస్థలోనే కొనసాగుతున్నారు. 2020లో కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ కార్నర్‌స్టోన్‌తో భాగస్వామ్యం కలిగి, ధర్మ కార్నర్‌స్టోన్ ఏజెన్సీ (DCA)ని ఏర్పాటు చేసింది. అయితే, కార్నర్‌స్టోన్‌తో క్రికెటర్ల అనుబంధం జాయింట్ వెంచర్‌తో సంబంధం లేకుండా ఉంది. బంటికి టీమ్ ఇండియాలో కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయి. సోహైల్ ఖాన్ మాజీ భార్య సీమా సోదరుడే బంటీ. అలాగే స్టార్ ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మకు బావ. అతని సోదరి కార్నర్‌స్టోన్‌లో చేరడం తోపాటు, స్పోర్ట్స్ మేనేజర్‌గా పనిచేసింది. ఇది ఇలా ఉంటే బంటీ తన పాఠశాల విద్యను ముంబైలో పూర్తి చేశాడు. ముంబైలోని HR కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్, ఆస్ట్రేలియా బాండ్ విశ్వవిద్యాలయంలలో ఉన్నత విద్యను అభ్యసించాడు. అతను పర్సప్ట్ ఎంటర్టైన్మెంట్లో టాలెంట్ అక్విజిషన్ అడ్వైజర్‌గా తన కరియర్‌ను ప్రారంభించాడు. -
టీం ఇండియాకు శుభాకాంక్షలు చెప్పండి..!
-
ICC వరల్డ్ కప్ షెడ్యూల్
-
యూఏఈకి దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన నేపాల్
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్ టూ 2019-23లో భాగంగా యూఏఈతో జరిగిన వన్డే మ్యాచ్‌లో నేపాల్ సంచలన విజయం సాధించింది. లీగ్‌లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్‌లోనూ యూఏఈకి షాకిచ్చిన నేపాల్.. నేటి మ్యాచ్‌లో మరింతగా రెచ్చిపోయి ఏకంగా 177 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. నేపాల్‌తో పోలిస్తే అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న యూఏఈ కీర్తిపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసి నేపాల్‌ను 248 పరుగులకు ఆలౌట్ చేసింది. నేపాల్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ పౌడెల్ (77) అర్ధసెంచరీతో కదంతొక్కగా.. భిమ్ షార్కీ (29), ఆరిఫ్ షేక్ (43), గుల్సన్ ఝా (37), దీపేంద్ర సింగ్ (34) ఓ మోస్తరుగా రాణించారు. యూఏఈ బౌలర్లలో ఆఫ్జల్ ఖాన్ (2/47), ఆర్యన్ ఖాన్ (1/28), జునైద్ సిద్దిఖీ (1/49), జహూర్ ఖాన్ (2/35), ముస్తఫా (2/61), జవార్ ఫరీద్ (2/9) వికెట్లు పడగొట్టారు. అనంతరం 249 పరుగుల ఓ మోస్తరు లక్ష్యఛేదనకు దిగిన యూఏఈ.. నేపాల్ బౌలర్లు లలిత్ (5/20), సందీప్ లమిచ్చాన్ (2/14), సోమ్‌పాల్ (1/6), దీపేంద్ర సింగ్ (1/15), గుల్సన్ ఝా (1/15)ల ధాటికి 22.5 ఓవర్లలో 71 పరుగులకే చాపచుట్టేసింది. యూఏఈ ఇన్నింగ్స్‌లో అయాన్ అఫ్జల్ (29), అష్వంత్ చిదంబరం (14), కార్తీక్ మెయ్యప్పన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. లీగ్‌లో భాగంగా ఇరు జట్లు మార్చి 16న మరోసారి తలపడనున్నాయి. -
ఛీ.. నీతో షేక్‌హ్యాండా? ఘోర అవమానం.. తగిన శాస్తే అంటున్న నెటిజన్లు
ICC Cricket World Cup League Two 2019-23- Nepal won by 3 wkts: నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచానేకు ఘోర అవమానం జరిగింది. జట్టులోని ఇతర ప్లేయర్లతో కరచాలనం చేసిన ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు.. కావాలనే సందీప్‌ను విస్మరించారు. అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా పక్కకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట ప్రత్యక్షం కాగా.. ‘‘తగిన శాస్తే జరిగింది. నీలాంటి వాళ్లకు ఇలాంటి ఘటనలు ఎదురైతేనన్నా కాస్త బుద్ధి వస్తుంది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2లో భాగంగా స్కాట్లాండ్, నమీబియా నేపాల్ పర్యటనకు వచ్చాయి. ఈ మూడు జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఆతిథ్య నేపాల్- పర్యాటక స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన నేపాల్ బౌలింగ్ ఎంచుకోగా.. స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మూడు వికెట్ల తేడాతో గెలుపు లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు 47 ఓవర్లనే పని ముగించింది. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన కుశాల్ మల్ల 81 పరుగులతో చెలరేగగా.. ఏడో స్థానంలో వచ్చిన దీపేంద్ర సింగ్ ఐరే 85 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా నేపాల్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో నేపాల్ జట్టును అభినందించే క్రమంలో స్కాట్లాండ్ ఆటగాళ్లు సందీప్ లమిచానేతో కరచాలనం చేసేందుకు విముఖత చూపారు. తమ చర్యతో సందీప్ పట్ల తమకున్న భావనను తెలియజేశారు. ఇందుకు కారణం ఏమిటంటే.. నేపాల్ కెప్టెన్ సందీప్ గతేడాది అత్యాచార ఆరోపణలతో అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం బెయిల్ మీద విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం షరతులకు లోబడి నేపాల్ క్రికెట్ అసోసియేషన్ అతడిపై నిషేధం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో ట్రై సిరీస్ ఆడేందుకు అనుమతినిచ్చింది. అయితే, కెప్టెన్సీ బాధ్యతలను మాత్రం రోహిత్ పౌడేల్‌కు అప్పగించింది. ఇక స్కాట్లాండ్తో మ్యాచ్‌లో రైట్ఆర్మ్ స్పిన్నర్ సందీప్ లమిచానే మూడు వికెట్లు పడగొట్టాడు. 22 ఏళ్ల యువ బౌలర్ 10 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి అందరికంటే మెరుగైన ప్రదర్శన (ఎకానమీ 2.70) కనబరిచాడు. అయితే, ఆటలో రాణించినా వ్యక్తిత్వంపై పడిన మచ్చ కారణంగా ఇలా అవమానం ఎదుర్కోకతప్పలేదతడికి! హింసకు వ్యతిరేకంగానే అంతకుముందు నమీబియా ఆటగాళ్లు కూడా సందీప్ పట్ల ఇలాగే వ్యవహరించారు. కాగా లింగ వివక్ష పూరిత హింసకు వ్యతిరేకంగా స్కాట్లాండ్, నమీబియా బోర్డుల సూచన మేరకే ఆటగాళ్లు ఈ మేరకు సందీప్‌తో షేక్‌హ్యాండ్‌కు నిరాకరించినట్లు తెలుస్తోంది. నేపాల్ బోర్డు సెలక్షన్‌తో తమకు పనిలేదని, అయితే, మహిళలపై హింసకు వ్యతిరేకంగా తమ స్పందన తెలియజేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సందీప్నకు నేపాల్ బోర్డు ముందే చెప్పడంతో అతడు కూడా వారికి దూరంగా ఉన్నట్లు ఈఎస్పీఎన్ తన కథనంలో పేర్కొంది. చదవండి: Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్ ఆమే.. ప్రకటించిన కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్.. వీడియో వైరల్ IND vs AUS: ఇదేమి బాల్‌రా బాబు.. దెబ్బకు రోహిత్ శర్మ షాక్! వైరల్ Cheteshwar Pujara: అయ్యో పుజారా! ఒకే ఒక్కడు.. తొలి క్రికెటర్.. కానీ పాపం.. Scotland Cricket Team refuses after match handshake with Sandeep Lamichhane. सन्दीप लामिछानेसँग हात मिलाएनन् स्कटिस खेलाडीलेhttps://t.co/bajsRRvfcDpic.twitter.com/mv3LHF4vYa — NepalLinks ︎ (@NepaliPodcasts) February 17, 2023 -
CWC 2023: నెదర్లాండ్స్ పర్యటనకు పాకిస్తాన్.. తొలిసారిగా..
ICC Cricket World Cup Super League: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఈ ఏడాది ఆగష్టులో నెదర్లాండ్స్‌లో పర్యటించనుంది. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ సూపర్ లీగ్‌లో భాగంగా మూడు వన్డేలు ఆడనుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ జకీర్ ఖాన్ ధ్రువీకరించారు. నిజానికి మూడు వన్డేల సిరీస్ నిమిత్తం 2020 జూలైలో పాకిస్తాన్ నెదర్లాండ్స్ టూర్‌కు వెళ్లాల్సింది. అయితే, కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ పర్యటనను వాయిదా వేశారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరుణంలో ఈ మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేశారు. ఈ ఏడాది ఆగష్టులో 16,18,21 తేదీల్లో రోట్టర్డామ్లోని వీఓసీ వేదికగా సిరీస్‌ను నిర్వహించనున్నారు. ఈ విషయం గురించి జకీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డుకు మద్దతుగా నిలబడతాం. 2023 వరల్డ్‌కప్ నేపథ్యంలో ఇరు జట్లు ఈ సిరీస్ ఆడనున్నాయి. నెదర్లాండ్స్‌లో క్రికెట్ అభివృద్ధి కోసం మేము మా వంతు సాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందే ఉంటాం’’ అని పేర్కొన్నాడు. కాగా గతంలో పాకిస్తాన్- నెదర్లాండ్స్ మూడు సందర్భాల్లో(1996, 2003 ప్రపంచకప్, 2002 చాంపియన్స్ ట్రోఫీ) తలపడ్డాయి. ఈ మూడు వన్డేల్లోనూ పాకిస్తాన్ విజయం సాధించింది. ఇక ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ సూపర్ లీగ్‌లో భాగంగా ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ ఆరింట గెలిచి.. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. నెదర్లాండ్స్ 10 ఓటములతో అట్టడుగున ఉంది. కాగా పాక్ జట్టు నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. చదవండి: IPL 2022: కుల్దీప్ క్రీడా స్ఫూర్తి.. ఈ అవార్డు అతడితో పంచుకుంటా.. క్రెడిట్ అంతా రిషభ్‌దే! 📢| Netherlands Men to face Pakistan in three ODIs as part of ICC Super League on August 16, 18 and 21 August @VOCRotterdam 🎟️ | Tickets go on sale on May 3 at 10 am CEST via https://t.co/BVV0fRAdEi ➡️ https://t.co/cvdWSbQFaL#TheSummerofCricket @TheRealPCB pic.twitter.com/C4wyX6mWvL — Cricket🏏Netherlands (@KNCBcricket) April 20, 2022 -
ఇదొక చెత్త రూల్: గంభీర్
న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ కప్ పోటీల్లో విశ్వ విజేత ఎవరో తేలిపోయింది. లార్డ్స్ మైదానం వేదికగా ఆదివారం రోజున న్యూజిలాండ్‌తో అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్స్‌లో ఇంగ్లండ్ విజయం సాధించి వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. ఈ ఫైనల్‌కు ముందు మూడు సందర్భాల్లో అంతిమ సమరం వరకు వెళ్లిన ఇంగ్లండ్ జట్టు ఒక్కసారి కూడా కప్ గెలవలేకపోయింది. కానీ నేటి విజయంతో ఇంగ్లండ్‌కి ఆ కల నెరవేరింది. అయితే, అంతకన్నా ముందుగా మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు హెన్రీ నికోల్స్ 55, టామ్ లాథం 47 పరుగులు చేయడంతో 50 ఓవర్లలో 241 పరుగులు సాధించింది. 242 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్ 241 పరుగులకు ఆలౌట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది.(ఇక్కడ చదవండి: విశ్వవిజేతగా ఇంగ్లండ్) మ్యాచ్ టై అవడంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చడం కోసం ఐసీసీ సూపర్ ఓవర్ నిర్వహించింది. ఈ సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అనంతరం 16 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ సైతం ఆరు బంతుల్లో 1 వికెట్ నష్టపోయి అదే 15 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ సైతం మళ్లీ టైగానే మిగిలింది. ఇక సూపర్ ఓవర్లోనూ స్కోర్లు ‘టై’ కావడంతో మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు సాధించిన ఇంగ్లండ్ విశ్వ విజేతగా అవతరించింది. బౌండరీ కౌంట్ నిబంధనను 'హాస్యాస్పదంగా' ఉందని పేర్కొంటూ భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఐసీసీపై విరుచుకుపడ్డాడు. అత్యంత ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ టై అయిన తర్వాత ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే గత నిబంధనను మార్చి బౌండరీల ద్వారా విజేతను ప్రకటించడంపై గంభీర్ ఐసీసీ తీరును తప్పుపట్టారు. ఈ తరహా విధానం సరైనది కాదంటూ విమర్శించాడు. ఇదొక చెత్త రూల్ అంటూ మండిపడ్డాడు. కాగా, మెగా ఫైట్‌లో కడవరకూ పోరాడిన ఇరు జట్లను గంభీర్ అభినందించాడు. -
హిట్‌మ్యాన్ వర్సెస్ ఎక్స్‌ప్రెస్ బౌలర్
-
ధోనితో ఆ లోగో తీయించండి
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ధోనికి భారత ఆర్మీ అంటే అభిమానం, గౌరవం. ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఉన్న ధోని రాష్ట్రపతి భవన్లో జరి గిన పద్మ అవార్డుల కార్యక్రమంలో ఆర్మీ కవాతుతో పురస్కారాన్ని స్వీకరించాడు. పుల్వామా దాడిని తీవ్రంగా ఖండించడమే కాదు... వారిని స్మరిస్తూ ఆసీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో జట్టు మొత్తం ఆర్మీ క్యాపులతో బరిలోకి దిగేలా చేశాడు. తనకు ఆర్మీలో చేరాలనే కోరిక ఉందని చాలాసార్లు చెప్పాడు కూడా. ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌లో ధోని కీపింగ్ గ్లౌజ్‌పై ‘బలిదాన్ బ్యాడ్జ్’ (ఆర్మీకి చెందిన ప్రత్యేకమైన లోగో) వేయించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఫెలుక్వాయోను స్టంపౌట్ చేయడం ద్వారా ఈ గ్లౌజ్‌పై ఉన్న లోగో అందరికంటా పడింది. అతని దేశభక్తి ఉన్నతమైనదే అయినా... దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ధోనితో ఆ లోగోను తీయించాల్సిందిగా భారత క్రికెట్ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల్లో ఆటగాళ్ల దుస్తులు, కిట్ సామాగ్రిపై జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తులు ఉండరాదు. ఈ నేపథ్యంలో బీసీసీఐని ఆ గుర్తు తీయించాలని కోరామని ఐసీసీ జనరల్ మేనేజర్ (కమ్యూనికేషన్స్) ఫర్లాంగ్ వెల్లడించారు. -
ప్రపంచకప్ రేడియో ప్రసార హక్కులు సోంతం చేసుకున్న బీబీసీ
-
అఫ్గాన్ చివరకు గెలిచింది
బులవాయో: ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో అఫ్గానిస్తాన్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో నేపాల్‌పై 6 వికెట్లతో గెలిచింది. ఇక ఆ జట్టు సూపర్‌సిక్స్ అవకా శాలు ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉన్నాయి. హాంకాంగ్‌తో నేడు (ఆదివారం) జరిగే పోరులో నేపాల్ గెలిస్తేనే అఫ్గానిస్తాన్ సూపర్ సిక్స్‌కు చేరుతుంది. ఒక వేళ ఓడితే గెలిచిన హాంకాంగ్ జట్టే ముందంజ వేస్తుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 49.5 ఓవర్లలో 194 పరుగుల వద్ద ఆలౌటైంది. పారస్ ఖడ్కా (75; 10 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ నబీ 4 వికెట్లు పడగొట్టారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ 38.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసి గెలిచింది. నజీబుల్లా జద్రాన్ (52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ చేశాడు. నేపాల్ బౌలర్ దీపేంద్ర సింగ్ ఐరి 2 వికెట్లు తీశాడు. మిగతా మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ 52 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలుపొందగా, నెదర్లాండ్స్ 57 పరుగుల తేడాతో పపువా న్యూగినియాపై నెగ్గింది. ఆతిథ్య జింబాబ్వే 89 పరుగుల తేడాతో హాంకాంగ్‌పై ఘనవిజయం సాధించింది. -
ధోనిపై క్లారిటీ ఇచ్చిన రవిశాస్త్రి
సాక్షి, న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ కెరీర్‌పై కమ్ముకున్న నీలి నీడలను హెడ్ కోచ్ రవిశాస్త్రి బుధవారం పటా పంచెలు చేశారు. టీం మేనేజ్మెంట్ 'ధోనిని తొలగించడం' అనే మాట గురించి ఇప్పటివరకూ ఆలోచించలేదని చెప్పారు. ధోని ప్రస్తుతం ఫామ్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు. 2019 ప్రపంచకప్‌లో ధోని ఆడతారని వెల్లడించారు. ధోని సాధించిన విజయాల దృష్ట్యా ఆయన్ను గౌరవించాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్, కపిల్ దేవ్‌లతో ధోని పోల్చారు రవిశాస్త్రి. ధోని లాంటి లెజెండ్‌ను ఎక్కడ కనిపెట్టగలమని ప్రశ్నించారు.