
ఐసీసీ చైర్మన్ గా శ్రీనివాసన్ ఎంపిక
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలి చైర్మన్‌గా బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ ఎంపికయ్యారు. త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నఆయన రెండేళ్లు పదవిలో కొనసాగనున్నారు. ఐసీసీ పాలక మండలి సమావేశం ఆయన్నుశనివారం చైర్మన్ గా ఎన్నుకుంది. శ్రీనివాసన్ కు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లు మద్దతుగా నిలివడంతో ఆయన ఎన్నికకు మార్గం సుగుమమైంది. పాకిస్తాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికాలు శ్రీనివాసన్ విముఖత వ్యక్తం చేసినా ఫలితం లేకుండా పోయింది.
అంతకుముందు గురువారం చెన్నైలో జరిగే బోర్డు అత్యవసర వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈమేరకు చర్చ జరిగింది. ఆ పదవి విషయంలో ఆయనకు బీసీసీఐ నుంచి పూర్తి మద్దతు నిలిచింది. కానీ ఐసీసీలో ఇంతకాలం చైర్మన్ పదవి లేకపోవడం గమనార్హం.