
హ్యూస్ వియ్ మిస్ యూ: మోదీ
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ జోయల్ హ్యూస్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. అతడి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈమేరకు తన సందేశాన్ని ట్విటర్ పోస్ట్ చేశారు.
'అందరి హృదయాలను కలచివేస్తూ ఆస్ట్రేలియాలో హ్యూస్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. హ్యూస్ నిన్ను మిస్సవుతున్నాం. నీ ఆటతీరు, విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నావు. నీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా' అని మోదీ ట్వీట్ చేశారు.
హ్యూస్ కు యావత్ క్రికెట్ ప్రపంచం కన్నీటి వీడ్కోలు పలికింది. హ్యూస్ అంతిమయాత్రలో ఆస్ట్రేలియా, భారత క్రికెటర్లతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Heart-rending funeral in Australia. Phil Hughes, we will miss you. Your game & exuberance won you fans all over! RIP.
— Narendra Modi (@narendramodi) December 3, 2014