
సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై మాజీ క్రికెటర్ నయన్ మోంగియా ప్రశంసల జల్లులు కురిపించారు. భారత్ వన్డేలు, టెస్టుల్లో నెంబర్ వన్ జట్టుగా నిలవడం తనకేమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదన్నారు. అందుకు మిస్టర్ కూల్ ధోనినే కారణమని పేర్కొన్నారు. కెప్టెన్ గా విరాట్ కోహ్లి ఉన్నప్పటికీ ధోని సలహాలతోనే ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ ను 4-1తో భారత్ నెగ్గిందని మోంగియా అభిప్రాయపడ్డారు. టెస్టుల్లో భారత్ కు ఉన్నతస్థానంలో నిలిపిన తర్వాతే ధోని రిటైరయ్యాడని కొనియాడారు. ధోని విలువ తెలుసు కనుక కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లిలు అతడికి అండగా నిలిచారన్నారు.
'ధోని అత్యుత్తమ ఫినిషర్ మాత్రమే కాదు. సీనియర్ బ్యాట్స్ మెన్ గా, వికెట్ కీపర్గా, మాజీ కెప్టెన్గా జట్టు విజయాలలో ధోని తన వంతు పాత్రను పోషిస్తున్నాడు. ధోని ప్రభావం వల్లనే వన్డేల్లోనూ జట్టు అద్భుత విజయాలు సాధిస్తూ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. 2019 వన్డే ప్రపంచ కప్ జట్టులో ధోని సభ్యుడిగా ఉంటాడు. అతడి సేవలు జట్టుకు సత్ఫలితాన్నిస్తాయి. జట్టులో అందరికంటే ఎక్కువగా ఆటను, మ్యాచ్ పరిస్థితిని అంచనా వేసే సామర్థ్యం ఉన్న కేవలం ధోనికే సొంతమని' భారత మాజీ క్రికెటర్ నయన్ మోంగియా కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment