ముంబై జట్టులోకి కివీస్‌ బౌలర్‌ | New Zealand Fast Bowler Has Been Signed By The Mumbai Indians | Sakshi
Sakshi News home page

ముంబై జట్టులోకి కివీస్‌ బౌలర్‌

Published Mon, Apr 16 2018 6:42 PM | Last Updated on Mon, Apr 16 2018 6:58 PM

New Zealand Fast Bowler Has Been Signed By The Mumbai Indians - Sakshi

ఆడమ్‌ మిల్నే(ఫైల్‌ ఫోటో)

సాక్షి, ముంబై : గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ స్థానాన్ని న్యూజిలాండ్‌ బౌలర్‌ ఆడమ్‌ మిల్నే భర్తీ చేయనున్నాడు. దీనిని ఐపీఎల్‌ అధికారులు ధృవీకరించారు. అయితే ఈ ఆటగాడి చేరికపై ముంబై ఇండియన్స్‌ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గత సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు ఆడిన ఈ కివీస్‌ బౌలర్‌పై ఈ సీజన్‌ వేలంలో ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. కానీ ఈ కివీస్‌ ఆటగాడికి ఈ ఐపీఎల్‌లో ఆడే అదృష్టం కమిన్స్‌ రూపంలో వరించింది. ఇప్పటికే మిల్నే ముంబై జట్టుతో చేరి ప్రాక్టీస్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఏప్రిల్‌ 17( మంగళవారం)న ముంబై, బెంగళూరుల మధ్య జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. 

ఇప్పటివరకు మిల్నే కివీస్‌ తరుపున 40 వన్డేల్లో 41 వికెట్లు, 19 టీ20ల్లో 21 వికెట్లు సాధించాడు. ఇక ఐపీఎల్‌లో బెంగళూర్‌ తరుపున  5 మ్యాచ్‌లు ఆడి  4 వికెట్లు సాధించాడు.   ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్‌ హ్యాట్రిక్‌ పరాజయం పొంది పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉన్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement