వైరల్‌: నెమార్‌ను స్టేడియంలో కింద పడేసి.. | Neymar And  Coutinho Egged In Brazil World Cup Preparations  | Sakshi
Sakshi News home page

వైరల్‌: నెమార్‌ను స్టేడియంలో కింద పడేసి..

Published Tue, Jun 12 2018 9:45 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

Neymar And  Coutinho Egged In Brazil World Cup Preparations  - Sakshi

సాకర్‌ మొదలవకముందే సరదా ఆటలు మొదలయ్యాయి. ఇప్పటికే ఫీఫా ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లు రష్యా చేరుకొని ప్రాక్టీస్‌ ప్రారంభించాయి. ఇక ప్రత్యర్థి జట్లను మట్టికరిపించడానికి వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ప్రాక్టీస్‌ మధ్యలో ఆటగాళ్లు చేసే కొంటె పనులు అభిమానులను అలరిస్తున్నాయి. కాగా, రష్యా చేరుకున్న బ్రెజిల్‌ జట్టు ముమ్మర ప్రాక్టీస్‌ మొదలెట్టింది. మంగళవారం ఆట మధ్యలో సాంబా జట్టు మిడ్‌ ఫీల్డర్‌ ఫిలిప్‌ కౌటినో 26వ పుట్టిన రోజు వేడుకలు మైదానంలో జరిపారు.

పుట్టిన రోజంటే కేక్‌ కట్‌ చేసి రచ్చరచ్చ చేస్తారు కానీ బ్రెజిల్‌ స్టార్‌  నెమార్‌ రూటే సపరేటు. కౌటినోకు విభిన్నంగా పుట్టిన రోజు విషెస్‌ చెప్పాలనుకున్నాడు. నెమార్‌కు  సహచర సభ్యులు జత కలవడంతో అందరూ కలిసి కోడిగుడ్లతో కౌటినోను నింపేశారు. అయితే నెమార్‌ చేసిన చిలిపి పనినే మరో సహచర ఆటగాడు మార్సిలొ చేశాడు. కౌటినో తరహాలోనే నెమార్‌ను టార్గెట్‌ చేసి అతన్ని కింద పడేసి కోడిగుడ్లతో అభిషేకం చేశారు. సాంబా ఆటగాళ్లు చేసిన అల్లరి పనులకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది. బ్రెజిల్‌ తన తొలి మ్యాచ్‌లో ఆదివారం స్విట్జర్లాండ్‌తో పోటీ పడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement