నిఖత్‌కు స్వర్ణం | nikhat won gold medal | Sakshi
Sakshi News home page

నిఖత్‌కు స్వర్ణం

Published Tue, Feb 24 2015 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM

నిఖత్‌కు స్వర్ణం

నిఖత్‌కు స్వర్ణం

సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూని వర్సిటీ బాక్సర్ నిఖత్ జరీన్ సత్తాచాటుకుంది. ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బాక్సింగ్ పోటీల్లో పసిడి పంచ్‌తో మెరిసింది. పంజాబ్‌లోని జలంధర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం మహిళల 51 కేజీల కేటగిరీలో పోటీపడిన ఆమె 3-0తో మహర్షి దయానంద్ యూనివర్షిటీ (రోహ్‌తక్)కి చెందిన రీతుపై విజయాన్ని నమోదు చేసింది. ఫైనల్ బౌట్‌లో నిఖత్ జోరుకు ప్రత్యర్థి ఏ దశలోనూ బదులివ్వలేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement