50 మీ. ఫ్రీస్టయిల్ విజేత నిర్విఘ్న
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన వేసవి శిబిరాల స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో నిర్విఘ్న 50 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో విజేతగా నిలిచాడు. సరూర్‌నగర్ స్టేడియంలోని స్విమ్మింగ్‌పూల్‌లో ఆదివారం జరిగిన అండర్–10 బాలుర ఫైనల్లో అతడు 40.95 సెకన్లలో లక్ష్యాన్ని చేరి టైటిల్ సాధించాడు. కాశీ 42.95 సెకన్లు, ఆదిత్య పట్వారీ 43.39 సెకన్లలో లక్ష్యం చేరి వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అండర్–14 బాలుర ఫ్రీస్టయిల్ విభాగంలో ధృవ 18.45 సెకన్లలో లక్ష్యం చేరి టైటిల్ గెలిచాడు. వరుణ్ (20.20 సెకన్లు) యశ్వంత్ (24.26 సెకన్లు) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. సరూర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు.
ఇతర విభాగాల విజేతల వివరాలు: అండర్–10 ఫ్రీస్టయిల్ 25 మీటర్లు: బాలురు: 1.అమిత్ లాల్ (21.16 సెకన్లు), 2.డి.కోనేరు (21.68 సెకన్లు), 3.ఒమర్ అబ్దుల్లా (22.16 సెకన్లు); బాలికలు: 1.క్రాంతి గుప్తా (19.63 సెకన్లు), 2.ఖుషి (22.76 సెకన్లు), 3.సుదీక్ష (24.81 సెకన్లు). అండర్–12 ఫ్రీస్టయిల్ 25 మీటర్లు: బాలురు: 1.అద్వైత్ (23.92 సెకన్లు), 2.వంశీ (27.26 సెకన్లు), 3.అభినవ్ (28.58 సెకన్లు); బాలికలు: 1.లాలిత్య (23.15 సెకన్లు), 2.ప్రణతి, 3.అను.