టెస్టులు నిర్వహించే రాష్ట్రాలకు బీసీసీఐ లేఖ
ముంబై: ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టులు నిర్వహించే రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ లేఖ రాసింది. ప్రస్తుతం ఆయా రాష్ట్ర సంఘాల వద్ద ఉన్న నిధులతో మ్యాచ్‌లను నిర్వహించగలరో లేదో చెప్పాలని కోరింది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు బీసీసీఐ నుంచి రాష్ట్ర సంఘాలకు వెళ్లిన నిధులను ఖర్చు చేయడానికి అవకాశం లేదు. దీంతో మ్యాచ్‌ల నిర్వహణకు రాష్ట్ర సంఘాలు ఇబ్బంది పడే అవకాశం ఉందని బోర్డు భావి స్తోంది. ఒకవేళ ఏదైనా సంఘం మ్యాచ్‌ను నిర్వహించలేమని ఇప్పుడు చెబితే వేదికను మార్చాలనేది బోర్డు ఆలోచన. ‘గతంలో మాదిరిగా మూడు నాలుగు నెలలకు ప్లాన్ చేసే పరిస్థితి లేదు. ప్రతి రోజూ ఖర్చులను సరిచూసుకుని ముందుకు వెళ్లాలి. అందుకే సంఘాలకు లేఖ రాశాం’ అని బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు. అలాగే సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో ఎంఓయూపై బీసీసీఐ సంతకం చేయాల్సి ఉంది. అరుుతే ఆడిటర్ నియామకం ఇంకా జరగనందున ఈ సిరీస్‌కు ఎంఓయూ చేయకపోవచ్చని ఆ ప్రతినిధి చెప్పారు.
అమలు చేసేవరకూ స్పందించరు...
నిజానికి ఇప్పుడు బీసీసీఐ తీసుకోవలసిన చాలా నిర్ణయాలు పెండింగ్‌లో ఉన్నారుు. అందులో ఐపీఎల్ హక్కుల టెండర్స్ ప్రధానమైది. ఆర్థిక వ్యవహారాలు, రోజువారీ కార్యకలాపాలలో ఎలా ముందుకు వెళ్లాలో తెలపాలంటూ లోధా కమిటీకి ఇప్పటికే బీసీసీఐ లేఖ రాసింది. అరుుతే దీనికి అటు నుంచి స్పందన రాలేదు. అక్టోబరు 21న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతిపాదనలను అమలు చేసేవరకూ బీసీసీఐ సభ్యులను కలవరాదని లోధా కమిటీ సభ్యులు నిర్ణరుుంచినట్లు సమాచారం. ఇదే జరిగితే బోర్డుకు మరిన్ని కష్టాలు తప్పవు.