state associations
-
తప్పుదోవపట్టిస్తే కఠిన చర్యలుంటాయ్
న్యూఢిల్లీ: ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు తాము డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే రాష్ట్ర సంఘాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తగా ఏర్పాటైన బీసీసీఐ పరిపాలక కమిటీ (సీఓఏ) హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం సమావేశమైన సీఓఏ ఐపీఎల్ విషయంలో రాష్ట్ర సంఘాల తీరును తప్పుబట్టింది. ‘మ్యాచ్ల నిర్వహణ కోసం సంబంధిత ఐపీఎల్ ఫ్రాంచైజీ, బీసీసీఐ సమంగా ఖర్చులను భరిస్తున్నాయి. గత 9 ఏళ్లుగా ఇదే విధంగా ఐపీఎల్ జరుగుతోంది. నిర్వహణ కోసం 60 లక్షలు అవసరమైతే ఐపీఎల్ ఫ్రాంచైజీ, బీసీసీఐ చెరో 30 లక్షల చొప్పున చెల్లిస్తున్నాయి. మధ్యలో రాష్ట్ర సంఘాలు ఐపీఎల్ కోసం తమ దగ్గర నిధుల్లేవంటూ చెప్పడం విడ్డూరంగా ఉంది’అని బోర్డు అధికారి ఒకరు అన్నారు. -
'కొత్త బేరర్ల జాబితా ఇవ్వండి'
ముంబై:లోధా కమిటీ సిఫారుసుల అమలును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) వేగవంతం చేసింది. ఇటీవల బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి అనురాగ్ ఠాకూర్, ప్రధాన కార్యదర్శి అజయ్ షిర్కేలను సుప్రీంకోర్టు తొలగించిన సంగతి తెలిసిందే. లోధా సిఫారుసుల అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆ ఇద్దర్ని సస్పెండ్ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ల ప్రక్షాళన కార్యాచరణను బీసీసీఐ ముమ్మరం చేసింది. ఈ మేరకు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ల కొత్త బేరర్ల జాబితాను తమకు అందజేయాలంటూ బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి విజ్ఞప్తి చేశారు. బీసీసీఐలో భాగస్వామిగా ఉన్న అన్ని రాష్ట్ర అసోసియేషన్లకు సోమవారం ఈ-మెయిల్ చేశారు. ఆయా అసోసియేషన్లలో అనర్హత కల్గిన వారిని తొలగించి నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. -
ఖర్చులు భరించగలరా..?
టెస్టులు నిర్వహించే రాష్ట్రాలకు బీసీసీఐ లేఖ ముంబై: ఇంగ్లండ్తో జరగనున్న ఐదు టెస్టులు నిర్వహించే రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ లేఖ రాసింది. ప్రస్తుతం ఆయా రాష్ట్ర సంఘాల వద్ద ఉన్న నిధులతో మ్యాచ్లను నిర్వహించగలరో లేదో చెప్పాలని కోరింది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు బీసీసీఐ నుంచి రాష్ట్ర సంఘాలకు వెళ్లిన నిధులను ఖర్చు చేయడానికి అవకాశం లేదు. దీంతో మ్యాచ్ల నిర్వహణకు రాష్ట్ర సంఘాలు ఇబ్బంది పడే అవకాశం ఉందని బోర్డు భావి స్తోంది. ఒకవేళ ఏదైనా సంఘం మ్యాచ్ను నిర్వహించలేమని ఇప్పుడు చెబితే వేదికను మార్చాలనేది బోర్డు ఆలోచన. ‘గతంలో మాదిరిగా మూడు నాలుగు నెలలకు ప్లాన్ చేసే పరిస్థితి లేదు. ప్రతి రోజూ ఖర్చులను సరిచూసుకుని ముందుకు వెళ్లాలి. అందుకే సంఘాలకు లేఖ రాశాం’ అని బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు. అలాగే సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో ఎంఓయూపై బీసీసీఐ సంతకం చేయాల్సి ఉంది. అరుుతే ఆడిటర్ నియామకం ఇంకా జరగనందున ఈ సిరీస్కు ఎంఓయూ చేయకపోవచ్చని ఆ ప్రతినిధి చెప్పారు. అమలు చేసేవరకూ స్పందించరు... నిజానికి ఇప్పుడు బీసీసీఐ తీసుకోవలసిన చాలా నిర్ణయాలు పెండింగ్లో ఉన్నారుు. అందులో ఐపీఎల్ హక్కుల టెండర్స్ ప్రధానమైది. ఆర్థిక వ్యవహారాలు, రోజువారీ కార్యకలాపాలలో ఎలా ముందుకు వెళ్లాలో తెలపాలంటూ లోధా కమిటీకి ఇప్పటికే బీసీసీఐ లేఖ రాసింది. అరుుతే దీనికి అటు నుంచి స్పందన రాలేదు. అక్టోబరు 21న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతిపాదనలను అమలు చేసేవరకూ బీసీసీఐ సభ్యులను కలవరాదని లోధా కమిటీ సభ్యులు నిర్ణరుుంచినట్లు సమాచారం. ఇదే జరిగితే బోర్డుకు మరిన్ని కష్టాలు తప్పవు.