న్యూఢిల్లీ: ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు తాము డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే రాష్ట్ర సంఘాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తగా ఏర్పాటైన బీసీసీఐ పరిపాలక కమిటీ (సీఓఏ) హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం సమావేశమైన సీఓఏ ఐపీఎల్ విషయంలో రాష్ట్ర సంఘాల తీరును తప్పుబట్టింది.
‘మ్యాచ్‌ల నిర్వహణ కోసం సంబంధిత ఐపీఎల్ ఫ్రాంచైజీ, బీసీసీఐ సమంగా ఖర్చులను భరిస్తున్నాయి. గత 9 ఏళ్లుగా ఇదే విధంగా ఐపీఎల్ జరుగుతోంది. నిర్వహణ కోసం 60 లక్షలు అవసరమైతే ఐపీఎల్ ఫ్రాంచైజీ, బీసీసీఐ చెరో 30 లక్షల చొప్పున చెల్లిస్తున్నాయి. మధ్యలో రాష్ట్ర సంఘాలు ఐపీఎల్ కోసం తమ దగ్గర నిధుల్లేవంటూ చెప్పడం విడ్డూరంగా ఉంది’అని బోర్డు అధికారి ఒకరు అన్నారు.
తప్పుదోవపట్టిస్తే కఠిన చర్యలుంటాయ్
Published Sat, Mar 18 2017 1:37 AM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM
Advertisement