'కొత్త బేరర్ల జాబితా ఇవ్వండి' | Johri urges state associations to submit new office bearers list | Sakshi
Sakshi News home page

'కొత్త బేరర్ల జాబితా ఇవ్వండి'

Published Tue, Jan 10 2017 1:50 PM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM

'కొత్త బేరర్ల జాబితా ఇవ్వండి'

'కొత్త బేరర్ల జాబితా ఇవ్వండి'

ముంబై:లోధా కమిటీ సిఫారుసుల అమలును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) వేగవంతం చేసింది. ఇటీవల బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి అనురాగ్ ఠాకూర్, ప్రధాన కార్యదర్శి అజయ్ షిర్కేలను సుప్రీంకోర్టు తొలగించిన సంగతి తెలిసిందే. లోధా సిఫారుసుల అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆ ఇద్దర్ని సస్పెండ్ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

దీనిలో భాగంగా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ల ప్రక్షాళన కార్యాచరణను బీసీసీఐ ముమ్మరం చేసింది. ఈ మేరకు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ల కొత్త బేరర్ల జాబితాను తమకు అందజేయాలంటూ బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి విజ్ఞప్తి చేశారు. బీసీసీఐలో భాగస్వామిగా ఉన్న అన్ని రాష్ట్ర అసోసియేషన్లకు సోమవారం ఈ-మెయిల్ చేశారు.  ఆయా అసోసియేషన్లలో అనర్హత కల్గిన వారిని తొలగించి నివేదిక అందజేయాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement