Lodha panel
-
లోధా సిఫారసులను అమలు చేస్తాం!
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ నిర్వహణలో వివిధ మార్పులను సూచిస్తూ లోధా కమిటీ చేసిన సిఫారసులను తమ సంఘంలో అమలు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్ణయించింది. వాటిని తమ నియమావళిలో చేరుస్తూ ఆమోదముద్ర వేసింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన హెచ్‌సీఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో లోధా సిఫారసుల్లో విడిగా కొన్ని అంశాల అమలుకు హెచ్‌సీఏ సిద్ధమైనా... అన్నింటికీ ఏకాభిప్రాయం కుదర్లేదు. అయితే ఈసారి పూర్తి స్థాయిలో వాటిని అమలు చేసేందుకు హెచ్‌సీఏ సిద్ధమైంది. అందు కోసం అసోసియేషన్ బైలాస్ (నియమావళిలో) కూడా లోధా సిఫారసులను చేర్చారు. రాబోయే రోజుల్లో సుప్రీం కోర్టు లోధా సిఫారసులకు సంబంధించి తుది తీర్పు ఇవ్వనుంది. ఆ తీర్పులో ఏమైనా మార్పులను సుప్రీం ఆదేశిస్తే దాని ప్రకారం మరోసారి నియమావళిని మార్చుకోవాలని కూడా ఎస్‌జీఎంలో హెచ్‌సీఏ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు హెచ్‌సీఏ నియమావళి ప్రకారం తెలంగాణ ప్రాంత పరిధిలోని 10 జిల్లాల్లో క్రికెట్ కార్యకలాపాలను హెచ్‌సీఏ పర్యవేక్షిస్తోంది. ఇప్పుడు దీనిని ‘తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలు’గా సవరించారు. సర్వసభ్య సమావేశంలో కొందరు సభ్యుల నుంచి వివిధ అంశాలపై కొంత అభ్యంతరాలు వ్యక్తమైనా... మొత్తంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగానే ముగిసింది. హైకోర్టు నియమించిన మాజీ న్యాయమూర్తులు జస్టిస్ సీతాపతి, జస్టిస్ అనిల్ దవే సమక్షంలో ఈ ఎస్జీఎం జరిగింది. దీనిని పర్యవేక్షిందుకు బీసీసీఐ తరఫున రత్నాకర్ శెట్టి హాజరయ్యారు. -
విచారణ జూలై 4కు వాయిదా
న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫార్సుల అమలుపై బీసీసీఐ–సీఓఏ వాదనలను సుప్రీంకోర్టు జూలై 4కు వాయిదా వేసింది. సంస్కరణలకు సంబంధించి శుక్రవారమే సుప్రీం ఎదుట విచారణ జరగాల్సి ఉంది అయితే, మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమైన చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మే 15కు వాయిదా వేయాలని నిర్ణయించింది. ఆ రోజు తాను సెలవులో ఉంటానని కోర్టు సహాయకుడు (అమికస్ క్యూరీ) విన్నవించడంతో తేదీని జూలై 4కు మార్చింది. మరోవైపు లోధా కమిటీ సిఫార్సుల్లో నాలుగింటిని అమలు చేయలేమని 12 క్రికెట్ సంఘాలు స్పష్టం చేసిన సంగతి తెలిసింద రూ.100 కోట్లు డిపాజిట్ చేయండి... ఐపీఎల్ నుంచి కొచ్చి టస్కర్స్ కేరళ (కేటీకే) సస్పెన్షన్ కేసుకు సంబంధించి రూ.100 కోట్లు డిపాజిట్ చేయాల్సిందిగా బీసీసీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2011 సీజన్ సందర్భంగా ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు టస్కర్స్ యాజమాన్యాన్ని బీసీసీఐ రూ.156 కోట్లకు తాజాగా బ్యాంక్ గ్యారంటీ కోరింది. కేటీకే అలా చేయడంలో విఫలమవడంతో టస్కర్స్‌కు చెందిన రూ.156 కోట్ల విలువైన డిపాజిట్లను బీసీసీఐ స్వాధీనం చేసుకుంది. దీనిపై కొచ్చి టస్కర్క్ 2015లో ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించగా ఏడాదికి 18 శాతం వడ్డీతో రూ.550 కోట్లు చెల్లించమంటూ బీసీసీఐని ఆదేశించింది. అయితే బీసీసీఐ బాంబే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది. కేటీకే మళ్లీ అపెక్స్ కోర్టుకు వెళ్లగా జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలు శుక్రవారం దానికి అనుకూలంగా తీర్పునిచ్చారు. అందులో భాగంగానే రూ.100 కోట్లు డిపాజిట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. -
‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’పై బోర్డు కమిటీ చర్చ
న్యూఢిల్లీ: ఆర్ఎం లోధాప్యానెల్ సూచించిన సంస్కరణల అమలుపై ఏర్పాటైన బీసీసీఐ కమిటీ శనివారం తొలిసారిగా సమావేశమైంది. మూడేళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్, ఒక రాష్ట్రం ఒక ఓటు అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. ముఖ్యంగా ఈ రెండు అంశాలపై పునరాలోచించాలని సుప్రీం కోర్టును కోరనున్నట్టు సమావేశంలో పాల్గొన్న ఓ సభ్యుడు తెలిపారు. ‘రొటేషన్ పద్ధతిలో ముంబై క్రికెట్ సంఘం ఓటు వేయాల్సిన పరిస్థితి రావడం దారుణం. భారత క్రికెట్‌కు ముంబై చేసిన సేవలు అమూల్యం. జాతీయ క్రీడా బిల్లును దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ సూచనలపై కూడా మేం చర్చించాం. ఈనెల 7న మరోసారి సమావేశమవుతాం’ అని ఆ సభ్యుడు వివరించారు. -
రాష్ట్రపతికన్నానా వయస్సు తక్కువే!
విమర్శలపై నిరంజన్ షా వ్యంగ్యం న్యూఢిల్లీ: లోధా ప్యానెల్ సూచించిన సంస్కరణల అమలుపై బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిటీలో ‘ప్రత్యేక ఆహ్వానితుడిగా’ 73 ఏళ్ల నిరంజన్ షాకు కూడా చోటు కల్పించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై షా ఘాటుగా స్పందించారు. ‘70 ఏళ్లకు పైగా వయస్సు కలిగిన వ్యక్తి మన దేశ రాష్ట్రపతి (ప్రణబ్ ముఖర్జీ, 81)గా సేవలందించవచ్చు.. కానీ బీసీసీఐ పరిపాలకులు మాత్రం ఆ వయస్సు లోపలే ఎందుకు ఉండాలి? అంతకు మించి వయస్సు ఉంటే వచ్చే నష్టమేముంది. ఎవరైనా సరే ఫిట్‌గా ఉంటే ఆఖరి శ్వాస వరకు సమర్థంగా పనిచేయవచ్చు’ అని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం మాజీ అధ్యక్షుడు షా స్పష్టం చేశారు. -
లోధా సంస్కరణల అమలుకు కమిటీ
బీసీసీఐ ఎస్‌జీఎంలో నిర్ణయం ముంబై: లోధా ప్యానెల్ సూచించిన సంస్కరణల అమలుపై కిందామీదా పడుతున్న బీసీసీఐ ఈ వ్యవహారాన్ని మరికొంత కాలం వాయిదా వేయాలని భావిస్తున్నట్టుంది. దీంట్లో భాగంగా బోర్డు ప్రక్షాళన కోసం ప్యానెల్ పేర్కొన్న ప్రతిపాదనలను ‘అత్యుత్తమంగా వేగంగా’ ఎలా అమలు చేయాలో సూచించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సోమవారం దాదాపు మూడు గంటల పాటు జరిగిన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) ఏ విషయంలోనూ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయింది. ఈ సమావేశానికి బోర్డు మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ కూడా హాజరయ్యారు. ‘ఎనిమిది అంశాల అజెండాతో ఎస్జీఎం జరిగింది. లోధా ప్యానెల్ నివేదిక అమలు కోసం ఐదు లేక ఆరుగురితో కూడిన కమిటీని నేడు (మంగళవారం) ఎంపిక చేస్తాం. నూతన సంస్కరణలపై కోర్టు ఇచ్చిన తీర్పును ఉత్తమంగా అమలు పరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కమిటీ 15 రోజుల్లోగా నివేదిక అందిస్తుంది. పరిపాలక కమిటీలోని సభ్యులు ఇందులో ఉండరు. ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వీటి అమలులో ఉన్న ఇబ్బందులను గుర్తించి సీఓఏకు తెలుపుతుంది’ అని కార్యదర్శి అమితాబ్ చౌదరి వివరించారు. ఒక రాష్ట్రం ఒక ఓటు, 70 ఏళ్ల గరిష్ట వయస్సు, మూడేళ్ల కూలింగ్ పీరియడ్ అమలుపై బోర్డు సభ్యుల్లో వ్యతిరేకత కనిపిస్తున్న విషయం విదితమే. మరోవైపు పాకిస్తాన్‌తో సిరీస్‌కు కేంద్రం అనుమతి తప్పనిసరి అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఇక భారత జట్టు కొత్త కోచ్‌ను ఎంపిక చేసే బాధ్యత పూర్తిగా క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)దేనని చౌదరి చెప్పారు. వచ్చేనెలలో జట్టు లంక పర్యటనకు వెళ్లకముందే కోచ్ ఎవరో తేలుతుందని ఆయన అన్నారు. -
కుంబ్లేకు ఇచ్చే గౌరవం ఇదేనా?
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ నియామకానికి సంబంధించి బీసీసీఐ ఇటీవల దరఖాస్తుల్ని ఆహ్వానించడంపై లోథా కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే సమయంలో భారత క్రికెట్ జట్టుకు సక్సెస్ ఫుల్ గా కోచ్ గా ఏడాది పాటు పని చేసిన కుంబ్లేను ఉన్నపళంగా పక్కకు పెట్టడాన్ని సైతం తప్పుబట్టింది. భారత క్రికెట్ జట్టులో ఎంతో ముఖ్యమైన కోచ్ పదవిని ఏడాదికే పరిమితం చేయడం ఎంతమాత్రం సరికాదని లోథా కమిటీ సెక్రటరీ గోపాల్ శంకరనారాయణ విమర్శించారు. క్రికెట్ లో పారదర్శకత అనేది ముఖ్యమని, ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలని గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్బంగా ప్రస్తావించారు. 'బీసీసీఐ పరిపాలకులు సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే పని చేయాలి. ఏడాది పాటు కోచ్ ను నియమించే క్రమంలో సుప్రీం తీర్పును పూర్తిస్థాయిలో అమలు చేయలేదనే విషయం స్పష్టమైంది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ కోచ్ కు దరఖాస్తుల్ని ఎందుకు కోరాల్సి వచ్చిందో అర్దం కావడం లేదు. కోచ్ గా విజయవంతమైన కుంబ్లే పదవీ కాలాన్ని ఎందుకు పొడిగించడం లేదు. ఒక జాతీయ కోచ్ కు ఇచ్చే గౌరవం ఇదేనా. ఏడాదిపాటు కోచ్ ను నియమించడం ఎంతవరకూ కరెక్ట్. ఇది క్రికెట్ ను ఎంతమాత్రం ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడదు అనే విషయం గుర్తించాలి.. మరొక ఏడాదికి ఎవరు కోచ్ గా వస్తారో చూద్దాం 'అని శంకరనారాయణ బీసీసీఐ తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతేడాది కుంబ్లే ను భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఏడాది కాలానికి కుంబ్లేను కోచ్ గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే అతని పదవి కాలాన్ని పొడిగించకుండా కొత్తగా కోచ్ అభ్యర్దికి దరఖాస్తులు కోరడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
'కొత్త బేరర్ల జాబితా ఇవ్వండి'
ముంబై:లోధా కమిటీ సిఫారుసుల అమలును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) వేగవంతం చేసింది. ఇటీవల బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి అనురాగ్ ఠాకూర్, ప్రధాన కార్యదర్శి అజయ్ షిర్కేలను సుప్రీంకోర్టు తొలగించిన సంగతి తెలిసిందే. లోధా సిఫారుసుల అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆ ఇద్దర్ని సస్పెండ్ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ల ప్రక్షాళన కార్యాచరణను బీసీసీఐ ముమ్మరం చేసింది. ఈ మేరకు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ల కొత్త బేరర్ల జాబితాను తమకు అందజేయాలంటూ బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి విజ్ఞప్తి చేశారు. బీసీసీఐలో భాగస్వామిగా ఉన్న అన్ని రాష్ట్ర అసోసియేషన్లకు సోమవారం ఈ-మెయిల్ చేశారు. ఆయా అసోసియేషన్లలో అనర్హత కల్గిన వారిని తొలగించి నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. -
తప్పుకోనున్న గగన్ ఖోడా, పరాంజపే
ముగ్గురితోనే జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీ న్యూఢిల్లీ: లోధా ప్యానెల్ సంస్కరణల అమలు నేపథ్యంలో జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యుల కుదింపు జరగనుంది. ప్రస్తుతం ఐదుగురితో కొనసాగుతున్న ఈ కమిటీని టెస్టులు ఆడిన ముగ్గురి ఆటగాళ్లతో సరిపుచ్చాలని గతంలో ప్యానెల్ సూచించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో గగన్ ఖోడా, జతిన్ పరాంజపే సెలక్టర్ల పదవి నుంచి తప్పుకోనున్నారు. వీరిద్దరికీ ఒక్క టెస్టు కూడా ఆడిన అనుభవం లేదు. గత సెప్టెంబర్‌లో బీసీసీఐ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీని నియమించింది. తాజా పరిస్థితి కారణంగా ఎమ్మెస్కే, దేవాంగ్ గాంధీ, శరణ్‌దీప్ సింగ్ ఇంగ్లండ్‌తో జరగబోయే వన్డే, టి20ల కోసం భారత జట్టును ఈనెల 5న ఎంపిక చేయనున్నారు. ‘కొత్త నిబంధనలు ఎలా ఉన్నాయో చూస్తాను. సీనియర్ జట్టు ఎంపిక సమయంలో కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. అతడు లేని పక్షంలో సంయుక్త కార్యదర్శి ఆ బాధ్యతలు చేపడతారు’ అని బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌధురి తెలిపారు. -
ఆగ్రహమా?... ‘అనురాగ’మా!
నేడు తేలనున్న అనురాగ్ ఠాకూర్, బీసీసీఐ భవిష్యత్ లోధా ప్యానెల్ సంస్కరణల అమలుపై తుది తీర్పు న్యూఢిల్లీ: ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), లోధా ప్యానెల్ మధ్య జరుగుతున్న కేసు విచారణలో నేడు (సోమవారం) సుప్రీం కోర్టు తుది తీర్పునివ్వనుంది. అలాగే కోర్టులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బోర్డు చీఫ్ అనురాగ్ ఠాకూర్ విషయంలోనూ కోర్టు ఏం చెబుతుందనేది వేచిచూడాల్సిందే. బీసీసీఐలో ‘కాగ్’ నియామకంపై అయిష్టంగా ఉన్న ఠాకూర్.. దీన్ని ప్రభుత్వ జోక్యంగా భావిస్తూ లేఖ రాయాలని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్‌కు గతంలో లేఖ రాశారు. అయితే కోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్లో ఠాకూర్ ఈ విషయాన్ని పేర్కొనలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు అసత్య ప్రమాణం చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకుంటే కేసు విచారణకు ఆదేశిస్తే జైలుకెళ్లాల్సి ఉంటుందని ఘాటుగా బదులిచ్చింది. అంతేకాకుండా వారం రోజుల్లో మరో అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. అలాగే ప్రస్తుతమున్న పాలక వర్గం లోధా ప్యానెల్ ప్రతిపాదనలను అమలు చేయడం లేదు కాబట్టి వీరి స్థానంలో సమర్థులైన ముగ్గురి పేర్లను సూచించాల్సిందిగా బీసీసీఐని కోరింది. మరోవైపు లోధా ప్యానెల్ సూచించిన ప్రతిపాదనలను అమలు చేయడం సాధ్యం కాదని, ఈ విషయంలో రాష్ట్ర క్రికెట్ సంఘాలను ఒత్తిడి చేయలేమని బీసీసీఐ తమ అఫిడవిట్లో కోర్టుకు తెలిపింది. అయితే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ మంగళవారమే పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తుది తీర్పు ఇస్తారా? మరోసారి వాయిదాకు మొగ్గు చూపుతారా? అనేది తేలాల్సి ఉంది. -
బీసీసీఐ, లోధా ప్యానెల్ కేసు విచారణ 14కు వాయిదా
న్యూఢిల్లీ: నూతన ప్రతిపాదనల అమలుపై జస్టిస్ ఆర్ఎం లోధా ప్యానెల్, బీసీసీఐ మధ్య సాగుతున్న విచారణ మరోసారి వారుుదా పడింది. వాస్తవానికి ఈనెల 5న ఈ విషయంలో సుప్రీంకోర్టు తుది తీర్పునివ్వాల్సి ఉండగా శుక్రవారానికి వాయిదా వేశారు. అరుుతే మరో కేసు విచారణ సుదీర్ఘంగా సాగడంతో ఈనెల 14కు బోర్డు, లోధా ప్యానెల్ కేసును వాయి దా వేశారు. చివరిసారిగా ఈ కేసు విచారణ అక్టోబర్ 21న జరిగింది. లోధా కమిటీ ప్రతిపాదనలను ఆయా రాష్ట్ర క్రికెట్ సంఘాలు అమలుపరిచే వరకు బోర్డు నుంచి ఎలాంటి నిధులు వెళ్లకూడదని ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బోర్డు ఆఫీస్ బేరర్లను తొలగించి పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లైను నియమించాలని ప్యానెల్ కోర్టుకు నివేదికను అందించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందోనని బోర్డు ఎదురుచూస్తోంది. -
బీసీసీఐ విజ్ఞప్తిపై లోధా ప్యానెల్ ఓటింగ్!
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ నిర్వహణ కోసం నిధుల విడుదలకు అనుమతి పొందిన బీసీసీఐ.. మరో మూడు విషయాల్లో లోధా ప్యానెల్ సమాధానం కోసం వేచిచూస్తోంది. ఆడిటర్ నియామకం, బీసీసీఐ ఆదాయ, వ్యయాల విలువను మదింపు చేయడంతో పాటు ప్యానెల్‌తో అపారుుంట్మెంట్ను బోర్డు కోరుకుంటున్నట్టు సమాచారం. అరుుతే ఈ విషయాన్ని తేల్చేందుకు తమ ముగ్గురు సభ్యుల మధ్య ఓటింగ్ పెట్టాలని ప్యానెల్ నిర్ణరుుంచుకుంది. నూతన ప్రతిపాదనలను అమలు చేసేందుకు ఎస్‌జీఎంలో తమ సభ్యుల మధ్య బీసీసీఐ చర్చ పెట్టినట్టుగానే లోధా ప్యానెల్ కూడా చేయబోతోంది. ‘సుప్రీం కోర్టు తీర్పును అమలు చేసేందుకు తమ సభ్యుల మధ్య బీసీసీఐ ఓటింగ్ పెట్టినట్టుగానే కమిటీ కూడా అలాగే చేస్తుంది’ అని ప్యానెల్ వర్గాలు తేల్చి చెప్పారుు. -
ఫిబ్రవరి 4న ఐపీఎల్ ఆటగాళ్ల వేలం
ఏప్రిల్ 5 నుంచి పదో సీజన్ న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్ 5 నుంచి నిర్వహించనున్నారు. అలాగే ఈ సీజన్ కోసం ఫిబ్రవరి 4న బెంగళూరులో ఆటగాళ్ల వేలం జరగనుంది. మంగళవారం లీగ్ పాలక మండలి సమావేశం జరిగింది. అయితే మరోసారి లోధా ప్యానెల్ సూచనలను బీసీసీఐ పక్కనబెట్టింది. ఓ అంతర్జాతీయ సిరీస్ ముగిసిన 15 రోజుల విరామం తర్వాతే ఐపీఎల్‌ను నిర్వహించాలని ప్యానెల్ పేర్కొంది. కానీ ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ ముగిసిన (మార్చి 29)న వారం రోజులకే పదో సీజన్ ప్రారంభమవుతోంది. ముంబై, పుణే, నాగ్‌పూర్‌లో ఈసారి మ్యాచ్‌లు జరుగుతాయని లీగ్ పాలక మండలి చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. ఠాకూర్, షిర్కే, గంగూలీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
ఇంగ్లండ్ పర్యటనపై ఆదేశాలు అవసరం లేదు
తేల్చిన లోధా ప్యానెల్ పర్యటన ఖర్చుల పూర్తి వివరాలు ఇవ్వండి న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీస్ కోసం పరస్పర అంగీకార ఒప్పందం (ఎంవోయూ)పై సంతకం చేసేందుకు బీసీసీఐకి తామెలాంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని జస్టిస్ ఆర్ఎం లోధా ప్యానెల్ స్పష్టం చేసింది. ఆ జట్టు ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందిస్తే తప్ప ఎలాంటి సూచనలు ఇవ్వబోమని తేల్చింది. ఈనెలలో ఇంగ్లండ్ జట్టు భారత్‌తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. అరుుతే సాధారణంగా పర్యాటక జట్టు ఖర్చులను ఆతిథ్య జట్టు భరించాల్సి ఉంటుంది కాబట్టి తగిన సూచనల కోసం బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కే ఇంతకుముందే ప్యానెల్‌కు లేఖ రాశారు. ఒకవేళ వారి ఖర్చులను వారే భరించుకోమని చెప్పమంటారా? అని కూడా అడిగారు. దీనికి ప్యానెల్ కార్యదర్శి గోపాల్ శంకర్‌నారాయణ్ ఈమెరుుల్ ద్వారా సమాధానం ఇచ్చారు. ‘భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రతిపాదిత ఎంవోయూ అనేది ద్వైపాక్షిక క్రికెట్‌కు సంబంధించిన విషయం. ఇందుకు మేం ఎలాంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక ఇంగ్లండ్ జట్టు ఖర్చులను బీసీసీఐ చెల్లించదలుచుకుంటే వాటికి సంబంధించిన పూర్తి వివరాలను మా ముందుంచితే తప్ప ఎలాంటి సూచనలు ఇవ్వలేము. అరుుతే ఎలాంటి అడ్డంకులు లేకుండా జట్టు క్రికెట్ క్యాలెండర్ సజావుగా సాగి అభిమానులను ఆనందంలో ముంచెత్తాలంటే సుప్రీం కోర్టు గత జూలై 18, అక్టోబర్ 7, 21న ఇచ్చిన తీర్పులకు లోబడి వ్యవహరిస్తే బావుంటుంది’ అని సూచించారు. ఇదిలావుండగా స్వతంత్ర ఆడిటర్ నియామకంపై, ఐపీఎల్ టెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 8లోగా తమకు సమర్పించాలని ప్యానెల్ తెలిపింది. ఒకవేళ ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే... దానికి కారణం ఠాకూర్, షిర్కేల మొండి వైఖరే అని లోధా కమిటీ సభ్యుడు ఒకరు అన్నారు. ఈ ఇద్దరూ ఇప్పటివరకూ అఫిడవిట్లు దాఖలు చేయలేదని గుర్తుచేశారు. సుప్రీం కోర్టు సూచనల పట్ల ఈ ఇద్దరికీ ఏ మాత్రం గౌరవం లేదని ఆ సభ్యుడు వ్యాఖ్యానించారు. నిధుల దుర్వినియోగంపై నివేదిక అందించండి బీసీసీఐకి సంబంధించిన పలు క్రికెట్ సంఘాల్లో నిధుల దుర్వినియోగంపై సమగ్ర నివేదిక అందించాల్సిందిగా లోధా ప్యానెల్ ఆదేశించింది. డెలారుుట్కు సంబంధించిన నివేదికలో ఒడిశా, జమ్మూ కశ్మీర్, హైదరాబాద్, అస్సాం క్రికెట్ సంఘాల్లో నిధుల దుర్వినియోగంతో పాటు పరిపాలన లోపం ఉన్నట్టు తేలింది. ఈ క్రికెట్ సంఘాల ఆటగాళ్లకు చెందిన చెల్లింపులు, అలవెన్సలు, ఇతర ఖర్చులను కూడా నివేదిక పూర్తిగా చదివాకే నిర్ణరుుస్తామని పేర్కొంది. ఈనెల 8లోగా రిపోర్ట్ పంపాలని సూచించింది. -
ఐపీఎల్ హక్కులపై ఏం చేయాలి?
లోధా ప్యానెల్‌ను కోరిన బీసీసీఐ న్యూఢిల్లీ: ఆర్థిక లావాదేవీల ప్రతిష్టంభనతో షాక్ తిన్న బీసీసీఐ ఇప్పుడు జాగ్రత్తగా తమ తదుపరి చర్యలు ఉండేలా చూసుకుంటోంది. ఈనేపథ్యంలో ఐపీఎల్ గ్లోబల్ మీడియా హక్కు (ప్రసార, ఇంటర్నెట్, మొబైల్ హక్కులు కలిపి)ల టెండర్ల విషయంలో ఎలా ముందుకెళ్లాలో సూచించాలంటూ లోధా ప్యానెల్‌కు బీసీసీఐ లేఖ రాసింది. టెండర్లను దాఖలు చేసేందుకు ఈనెల 25 ముగింపు తేదీ. సుప్రీం కోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పు ప్రకారం బీసీసీఐ ఆర్థిక వ్యవహారాలను, భారీ స్థారుు విలువ కలిగిన టెండర్లను పరిశీలించేందుకు ప్యానెల్ ఆడిటర్లను నియమించాల్సి ఉంది. అందుకే కార్యదర్శి అజయ్ షిర్కే లోధా ప్యానెల్‌ను సంప్రదించారు. ఫేస్బుక్, ట్విట్టర్ సహా మొత్తం 18 కంపెనీలు టెండర్ డాక్యుమెంట్స్‌ను కొనుగోలు చేశారుు. -
బీసీసీఐకి సుప్రీంలో నిరాశ
న్యూఢిల్లీ: లోధా కమిటీ ప్రతిపాదనలను మరోసారి సమీక్షించాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చేసిన అభ్యర్ధనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం విచారించిన సుప్రీం.. లోధా ప్రతిపాదనలపై ఆమోద ముద్ర వేస్తూ గతంలో తాము ఇచ్చిన తీర్పును తిరిగి పరిశీలించాల్సిన అవసరం లేదంటూ తేల్చి చెప్పింది. బీసీసీఐ ప్రక్షాళనలో భాగంగా ఈ ఏడాది జనవరిలో లోధా కమిటి పలు ప్రతిపాదనలు సూచించిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనలకు సుప్రీంకోర్టు జూలై18వ తేదీన ఆమోద ముద్ర వేసింది. అయితే లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనల్లో కొన్ని అభ్యంతకరంగా ఉన్నాయంటూ బీసీసీఐ పిటిషన్ దాఖలు చేసింది. ప్రధానంగా కూలింగ్ పీరియడ్, ఒక రాష్ట్రానికి ఒక ఓటు, గరిష్ట వయో పరిమితలపై బీసీసీఐ తన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ వేసింది. అయితే ఆ పిటిషన్ పై సమీక్ష జరపడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. -
లోధా ప్యానల్ వల్లే..
ముంబై:తమకు సుప్రీంకోర్టుకు మధ్య అపార్థాలు చోటు చేసుకోవడానికి లోధా కమిటీనే కారణమని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సెక్రటరీ అజయ్ షిర్కే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితికి లోధా కమిటీనే కారణమన్నాడు. అయితే లోధా ప్యానెల్ ప్రతిపాదనల అమలుకు తమకు కొన్ని నిర్ధిష్టమైన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు సూచించాలని షిర్కే పేర్కొన్నారు. ఆ రకంగా కోర్టు తమకు కొన్ని సూచనలు చేస్తే సాంకేతికంగా లోధా ప్రతిపాదనల్ని అమలు చేయడానికి ఆస్కారం ఉంటుందన్నారు. 'లోధా ప్యానల్ ప్రతిపాదనల అమలుపై కోర్టుపై గౌరంతోనే ఉన్నాం. మేము ఎక్కడికీ దూరంగా పారిపోవడం లేదు. వాటిని అమలు చేయడానికి మాకు ఎటువంటి భయం లేదు. కాకపోతే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులున్నాయి. వాటిని కోర్టుకు తెలియజెప్పాలని అనుకుంటున్నాం. ఈ విషయంలో కోర్టు సాయం కోరతాం' అని జాతీయ దినపత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెక్స్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో షిర్కే పేర్కొన్నారు. -
సుప్రీం తీర్పు 17కి వాయిదా
• రాష్ట్ర సంఘాలకు • నిధులు ఆపేయండి • సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వు న్యూఢిల్లీ: బీసీసీఐ కాస్త ఊపిరి పీల్చుకుంది. లోధా ప్యానెల్ సూచనల అమలుకు ఒక్క రోజులోగా హామీ ఇవ్వకపోతే ఆఫీస్ బేరర్లందరినీ తప్పిస్తామని హెచ్చరించిన సుప్రీం కోర్టు తమ తుది తీర్పును ఈనెల 17కు వాయిదా వేసింది. అయితే సంస్కరణల అమలుకు రాష్ట్ర సంఘాలు సుముఖత వ్యక్తం చేసే వరకు వాటికి ఎలాంటి నిధులు విడుదల చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం ఈ విచారణ జరిపింది. ఇప్పటికే 13 సంఘాలకు రూ.16.72 కోట్ల చొప్పున బీసీసీఐ విడుదల చేసింది. కానీ లోధా సంస్కరణలను అమలు చేస్తామని ఆయా సంఘాలు తీర్మానించేదాకా వాటిని ఖర్చు చేయని పరిస్థితి నెలకొంది. బీసీసీఐ ఎప్పుడూ సంస్కరణలకు వ్యతిరేకం కాదని, కొన్ని సాంకేతికపరమైన అడ్డంకులు ఉన్నాయని బోర్డు కౌన్సిల్ రాధా రంగస్వామి కోర్టుకు తెలిపారు. తాము వాట న్నింటినీ తొలగిస్తామని కోర్టు స్పష్టం చేసింది. అంతకన్నా ముందు మీరు అఫిడవిట్ దాఖలు చేయండని సూచించి విచారణను 17కు వాయిదా వేసింది. మరోవైపు లోధా ప్రతిపాదనల అమలును అడ్డుకునేందుకు ఐసీసీతో సంప్రదింపులు చేయడంపై పది రోజుల్లో వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేయాలని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌ను కోర్టు ఆదేశిం చింది. గత నెల 21న జరిగిన తమ ఏజీఎంలో లోధా ప్యానెల్ సూచనలను బేఖాతరు చేస్తూ అన్ని కమిటీల నియామకం చేపట్టడంతో పాటు కార్యదర్శి ఎన్నిక కూడా చేయడంతో ఈ వివాదం ముదిరిన విషయం తెలిసిందే. -
మా గ్రూపులో పాకిస్తాన్ వద్దు
ముంబై: జస్టిస్ ఆర్ఎం లోధా ప్యానెల్ ప్రతిపాదనల అమలుపై శుక్రవారం జరగాల్సిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) ఒకరోజు పాటు వాయిదా పడింది. సమావేశానికి హాజరైన రాష్ట్ర సంఘాల ప్రతినిధుల్లో కొందరి దగ్గర అధికారిక అనుమతి పత్రాలు లేవనే కారణంతో ఎస్‌జీఎంను శనివారానికి వాయిదా వేశారు. నిజానికి లోధా కమిటీ సంస్కరణలను తొలి దశలో అమలు చేయడానికి సుప్రీం కోర్టు బీసీసీఐకి ఇచ్చిన గడువు శుక్రవారంతోనే ముగిసింది. పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లే కాదు.. అంతర్జాతీయ టోర్నమెంట్స్‌లోనూ కలిసి ఆడకూడదని బీసీసీఐ నిర్ణయించుకుంది. అందుకే భవిష్యత్‌లో అన్ని దేశాలు పాల్గొనే టోర్నీల్లో తమ రెండు జట్లను ఒకే గ్రూపులో ఉంచకుండా చూడాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని కోరింది. మరో ఏడు నెలల్లో ఇంగ్లండ్‌లో చాంపియన్స ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో బీసీసీఐ ఇలా స్పందించింది. -
సుప్రీం యార్కర్
-
బీసీసీఐపై సుప్రీం కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయనందుకు సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీసీఐ తీరును సుప్రీం కోర్టు తప్పుపట్టింది. లోధా కమిటీ బుధవారం సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది. బీసీసీఐలో ప్రక్షాళన చేయాలని, పాలనలో మార్పులు తీసుకురావాలని తాము చేసిన సిఫార్సులను బోర్డు విస్మరించిందని కోర్టుకు తెలియజేసింది. బీసీసీఐ చీఫ్ సహా ఇతర అధికారులపై వేటువేయాలని కోరింది. అక్టోబర్ 6న ఈ కేసును విచారించనున్నట్టు చీఫ్ జస్టిస్ టీఎస్ థాకూర్ చెప్పారు. బీసీసీఐ తమకు తామే చట్టమని భావిస్తున్నట్టుందని, ఇది తప్పని అన్నారు. బీసీసీ ఇలా వ్యవహరిస్తుందని అనుకోలేదని, లోధా కమిటీ సిఫార్సులకు బోర్డు కట్టుబడి ఉండాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణం వెలుగుచూసిన తర్వాత బీసీసీఐని ప్రక్షాళన చేసేందుకు సుప్రీం కోర్టు లోధా కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీం ఆదేశాల మేరకు లోధా కమిటీ బోర్డు ప్రక్షాళనకు పలు సిఫార్సులు చేసింది. -
లోథా ప్యానల్‌పై రవిశాస్త్రి మండిపాటు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రలో బోర్డు(బీసీసీఐ) ప్రక్షాళన కొరకు లోథా ప్యానల్ సూచించిన ప్రతిపాదనలను టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి తప్పుబట్టాడు. లోథా కమిటీ ప్రతిపాదించిన పలు సిఫారుసులు సరిగా లేవంటూ విమర్శించాడు. ప్రధానంగా బీసీసీఐలో ఒక సభ్యుడు పదవిలో ఉంటే సుదీర్ఘ విరామం తీసుకున్న తరువాతే మరో పదవి చేపట్టాలన్న లోథా సిఫారుసును రవిశాస్త్రి తీవ్రంగా తప్పుబట్టాడు. ఈ తరహా నిబంధన బీసీసీఐ పరిపాలనలో పదవి చేపట్టాలనుకునే మాజీ క్రికెటర్లకు తీవ్ర విఘాతం కల్గిస్తుందన్నాడు. బీసీసీఐ పరిపాలన విభాగంలో ఉన్న ఒక సభ్యుని పదవీ కాలం కనీసం ఆరు సంవత్సరాలు ఉండాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. దాంతో పాటు బీసీసీఐలో ఐదుగురు సెలక్టర్లతో కూడిన కమిటీ ఉండాలన్నాడు. ఈ ఏడాది జనవరిలో లోథా ప్యానెల్ పలు సిఫారుసులను బీసీసీఐకి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అందులో 70 ఏళ్లు పైబడిన వారు బీసీసీఐలో, రాష్ట్ర సంఘాల్లోనూ సభ్యులు కాకూడదనేది ఒకటైతే, ఒక రాష్ట్రానికి ఒక్కటే ఓటు. రాష్ట్రంలోని మిగిలిన సంఘాలు అనుబంధ సభ్యులు మాత్రమే ఉండాలని సూచించింది. దాంతో పాటు ఒక సభ్యుడు మూడేళ్లు పదవిలో ఉంటే విరామం తీసుకుని తిరిగి మరో పదవి తీసుకోవాలని, అదే సమయంలో ఒక సభ్యుడు గరిష్టంగా మూడుసార్లు మాత్రమే పదవిలో ఉండాల అంటూ బీసీసీఐకి ప్రతిపాదించింది. -
రెండు నెలల్లో అమలు చేయండి
బీసీసీఐకి లోధా ప్యానెల్ సూచన న్యూఢిల్లీ: తమ రాజ్యాంగ సవరణలకు సంబంధించి 15 సంస్కరణలను అక్టోబర్ 15లోపు అమలు చేయాల్సిందిగా బీసీసీఐకి జస్టిస్ లోధా ప్యానెల్ సూచించింది. సుప్రీం కోర్టు తీర్పుననుసరించి సంస్కరణల అమలుపై మంగళవారం బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కే.. ప్యానెల్‌తో సమావేశమయ్యారు. దీంట్లో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పాల్గొనాల్సి ఉన్నా గైర్హాజరయ్యారు. ఈనెల 25లోగా తాము అమలు చేసే సంస్కరణలపై నివేదిక ఇస్తామని షిర్కే వారికి తెలిపారు. ఒకే రాష్ట్రం ఒకే ఓటు, గరిష్ట వయస్సు ప్రతిపాదన వంటి ప్రతిపాదనలను అమలు చేయడం వల్ల వచ్చే సమస్యలపై ప్యానెల్‌తో షిర్కే చర్చించారు. అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇప్పుడేమీ చేయలేమని లోధా కమిటీ తేల్చి చెప్పినట్టు సమాచారం. అమెరికాలో విండీస్‌తో జరిగే రెండు టి20ల హక్కులను సోమవారం స్టార్ ఇండియాకు రూ.34.2 కోట్లకు బీసీసీఐ అప్పగించింది. అయితే మ్యాచ్‌ల ప్రసార హక్కుల విషయంలో మరింత పారదర్శకత పాటించాలని ప్యానెల్ సూచించింది. -
సమావేశానికి రావాల్సిందే..
బోర్డుకు తేల్చి చెప్పిన లోధా ప్యానెల్ న్యూఢిల్లీ: జస్టిస్ లోధా ప్యానెల్‌తో నేటి (మంగళవారం) సమావేశాన్ని వాయిదా వేయించేందుకు బీసీసీఐ చేసిన ప్రయత్నం విఫలమైంది. సుప్రీం కోర్టు తీర్పుననుసరించి సంస్కరణల అమలుపై చర్చించేందుకు ఈనెల 9న బోర్డు.. లోధా ప్యానెల్‌తో సమావేశం కావాల్సి ఉంది. కానీ కార్యదర్శి అజయ్ షిర్కే సోమవారం రాత్రి కమిటీకి వాయిదా కోసం లేఖ రాశారు. అయితే ఈ మీటింగ్‌ను ఎట్టి పరిస్థితిలోనూ వాయిదా వేయబోమని లోధా ప్యానెల్ స్పష్టం చేసింది. ఉదయం 11 గంటలలోపు బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, షిర్కే హాజరుకాకుంటే కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని ప్యానెల్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
సుప్రీం తీర్పును గౌరవిస్తున్నాం: బీసీసీఐ
న్యూఢిల్లీ: జస్టిస్ లోథా కమిటీ ప్రతిపాదించిన సిఫారుసుల అమలుపై తాజాగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును తాము గౌరవపూర్వకంగా స్వీకరిస్తున్నట్లు బీసీసీఐ సీనియర్ కోశాధికారి , ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. అయితే లోథా కమిటీ ప్రతిపాదనలను ఏ రకంగా అమలు చేయాలనే దానిపై ప్రధాన దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. 'సుప్రీం తీర్పును గౌరవిస్తున్నాం. లోథా కమిటీ కొన్ని ప్రతిపాదనలు సూచించింది. ఆ ప్రతిపాదనల్లో చాలా వాటిని సుప్రీం ఆమోదించింది. వాటిని అమలు చేయడానికి కచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళతాం. అయితే ఎలా అమలు చేయాలి అనే దానిపై త్వరలో కార్యచరణ రూపొందిస్తాం' అని శుక్లా పేర్కొన్నారు. బీసీసీఐ ప్రక్షాళనలో భాగంగా ఈ ఏడాది జనవరిలో ఏర్పాటైన జస్టిస్ లోథా కమిటీ అనేక ప్రతిపాదనలను సూచించింది. అయితే దీనిపై కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసిన బీసీసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిలో భాగంగా సోమవారం మరోసారి బీసీసీఐ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం.. దాదాపులోథా కమిటీ సూచించిన అన్ని ప్రధాన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఆరు నెలల్లో క్రికెట్‌ను ప్రక్షాళన చేయాలని బీసీసీఐకు సూచించిన సుప్రీం.. క్రికెట్ కు రాజకీయ నేతలకు దూరంగా ఉండాలని తీర్పులో స్పష్టం చేసింది.