తేల్చిన లోధా ప్యానెల్
పర్యటన ఖర్చుల పూర్తి వివరాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీస్ కోసం పరస్పర అంగీకార ఒప్పందం (ఎంవోయూ)పై సంతకం చేసేందుకు బీసీసీఐకి తామెలాంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని జస్టిస్ ఆర్‌ఎం లోధా ప్యానెల్ స్పష్టం చేసింది. ఆ జట్టు ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందిస్తే తప్ప ఎలాంటి సూచనలు ఇవ్వబోమని తేల్చింది. ఈనెలలో ఇంగ్లండ్ జట్టు భారత్‌తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. అరుుతే సాధారణంగా పర్యాటక జట్టు ఖర్చులను ఆతిథ్య జట్టు భరించాల్సి ఉంటుంది కాబట్టి తగిన సూచనల కోసం బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కే ఇంతకుముందే ప్యానెల్‌కు లేఖ రాశారు. ఒకవేళ వారి ఖర్చులను వారే భరించుకోమని చెప్పమంటారా? అని కూడా అడిగారు. దీనికి ప్యానెల్ కార్యదర్శి గోపాల్ శంకర్‌నారాయణ్ ఈమెరుుల్ ద్వారా సమాధానం ఇచ్చారు. ‘భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రతిపాదిత ఎంవోయూ అనేది ద్వైపాక్షిక క్రికెట్‌కు సంబంధించిన విషయం. ఇందుకు మేం ఎలాంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక ఇంగ్లండ్ జట్టు ఖర్చులను బీసీసీఐ చెల్లించదలుచుకుంటే వాటికి సంబంధించిన పూర్తి వివరాలను మా ముందుంచితే తప్ప ఎలాంటి సూచనలు ఇవ్వలేము.
అరుుతే ఎలాంటి అడ్డంకులు లేకుండా జట్టు క్రికెట్ క్యాలెండర్ సజావుగా సాగి అభిమానులను ఆనందంలో ముంచెత్తాలంటే సుప్రీం కోర్టు గత జూలై 18, అక్టోబర్ 7, 21న ఇచ్చిన తీర్పులకు లోబడి వ్యవహరిస్తే బావుంటుంది’ అని సూచించారు. ఇదిలావుండగా స్వతంత్ర ఆడిటర్ నియామకంపై, ఐపీఎల్ టెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 8లోగా తమకు సమర్పించాలని ప్యానెల్ తెలిపింది. ఒకవేళ ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే... దానికి కారణం ఠాకూర్, షిర్కేల మొండి వైఖరే అని లోధా కమిటీ సభ్యుడు ఒకరు అన్నారు. ఈ ఇద్దరూ ఇప్పటివరకూ అఫిడవిట్‌లు దాఖలు చేయలేదని గుర్తుచేశారు. సుప్రీం కోర్టు సూచనల పట్ల ఈ ఇద్దరికీ ఏ మాత్రం గౌరవం లేదని ఆ సభ్యుడు వ్యాఖ్యానించారు.
నిధుల దుర్వినియోగంపై నివేదిక అందించండి
బీసీసీఐకి సంబంధించిన పలు క్రికెట్ సంఘాల్లో నిధుల దుర్వినియోగంపై సమగ్ర నివేదిక అందించాల్సిందిగా లోధా ప్యానెల్ ఆదేశించింది. డెలారుుట్‌కు సంబంధించిన నివేదికలో ఒడిశా, జమ్మూ కశ్మీర్, హైదరాబాద్, అస్సాం క్రికెట్ సంఘాల్లో నిధుల దుర్వినియోగంతో పాటు పరిపాలన లోపం ఉన్నట్టు తేలింది. ఈ క్రికెట్ సంఘాల ఆటగాళ్లకు చెందిన చెల్లింపులు, అలవెన్‌సలు, ఇతర ఖర్చులను కూడా నివేదిక పూర్తిగా చదివాకే నిర్ణరుుస్తామని పేర్కొంది. ఈనెల 8లోగా రిపోర్ట్ పంపాలని సూచించింది.