
బీసీసీఐ విజ్ఞప్తిపై లోధా ప్యానెల్ ఓటింగ్!
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ నిర్వహణ కోసం నిధుల విడుదలకు అనుమతి పొందిన బీసీసీఐ.. మరో మూడు విషయాల్లో లోధా ప్యానెల్ సమాధానం కోసం వేచిచూస్తోంది. ఆడిటర్ నియామకం, బీసీసీఐ ఆదాయ, వ్యయాల విలువను మదింపు చేయడంతో పాటు ప్యానెల్‌తో అపారుుంట్‌మెంట్‌ను బోర్డు కోరుకుంటున్నట్టు సమాచారం. అరుుతే ఈ విషయాన్ని తేల్చేందుకు తమ ముగ్గురు సభ్యుల మధ్య ఓటింగ్ పెట్టాలని ప్యానెల్ నిర్ణరుుంచుకుంది.
నూతన ప్రతిపాదనలను అమలు చేసేందుకు ఎస్‌జీఎంలో తమ సభ్యుల మధ్య బీసీసీఐ చర్చ పెట్టినట్టుగానే లోధా ప్యానెల్ కూడా చేయబోతోంది. ‘సుప్రీం కోర్టు తీర్పును అమలు చేసేందుకు తమ సభ్యుల మధ్య బీసీసీఐ ఓటింగ్ పెట్టినట్టుగానే కమిటీ కూడా అలాగే చేస్తుంది’ అని ప్యానెల్ వర్గాలు తేల్చి చెప్పారుు.