లోధా ప్యానల్ వల్లే.. | Lodha Panel has created misunderstanding between BCCI and Supreme Court, says Ajay Shirke | Sakshi
Sakshi News home page

లోధా ప్యానల్ వల్లే..

Published Sun, Oct 9 2016 12:00 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

లోధా ప్యానల్ వల్లే..

లోధా ప్యానల్ వల్లే..

ముంబై:తమకు సుప్రీంకోర్టుకు మధ్య అపార్థాలు చోటు చేసుకోవడానికి లోధా కమిటీనే కారణమని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సెక్రటరీ అజయ్ షిర్కే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితికి లోధా కమిటీనే కారణమన్నాడు. అయితే లోధా ప్యానెల్ ప్రతిపాదనల అమలుకు  తమకు కొన్ని నిర్ధిష్టమైన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు సూచించాలని షిర్కే పేర్కొన్నారు. ఆ రకంగా కోర్టు తమకు కొన్ని సూచనలు చేస్తే సాంకేతికంగా లోధా ప్రతిపాదనల్ని అమలు చేయడానికి ఆస్కారం ఉంటుందన్నారు.

 

'లోధా ప్యానల్ ప్రతిపాదనల అమలుపై కోర్టుపై గౌరంతోనే ఉన్నాం. మేము ఎక్కడికీ దూరంగా పారిపోవడం లేదు. వాటిని అమలు చేయడానికి మాకు ఎటువంటి భయం లేదు. కాకపోతే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులున్నాయి. వాటిని కోర్టుకు తెలియజెప్పాలని అనుకుంటున్నాం. ఈ విషయంలో కోర్టు సాయం కోరతాం' అని జాతీయ దినపత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెక్స్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో షిర్కే పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement