Ajay Shirke
-
‘షిర్కేకు ఆ అర్హత లేదు’
ముంబై: బీసీసీఐ కార్యదర్శి స్థానం నుంచి సుప్రీంకోర్టు ఉద్వాసనకుగురైన అజయ్షిర్కేకు బోర్డులో పూర్తిగా దారులు మూసుకుపోయినట్టేనని లోధా ప్యానెల్ స్పష్టం చేసింది. మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసీఏ) ప్రతినిధిగా కూడా ఆయనకు బీసీసీఐ సమావేశాల్లో పాల్గొనేందుకు అర్హత లేదని తేల్చింది. తరచుగా అడిగే ప్రశ్నలకు ప్యానెల్ తగిన సమాధానాలు తెలిపి సందేహాలను నివృత్తి చేసింది. ఏడు ప్రశ్నలతో కూడిన ఈ జాబితాలో షిర్కే అంశం రెండో ప్రాధాన్యంలో పేర్కొంది. అలాగే బోర్డు అధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలున్నట్టు పేర్కొంటున్న బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) చీఫ్ సౌరవ్ గంగూలీ మూడేళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్ పరిధిలోకి వస్తాడని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో గంగూలీ క్యాబ్ పదవీకాలం ముగుస్తుంది. -
'బీసీసీఐతో నా అనుబంధం ముగిసింది'
న్యూఢిల్లీ:లోధా కమిటీ సిఫారుసులను అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలు తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అనురాగ్ ఠాకూర్ ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనం పాటిస్తుండగా, షిర్కే మాత్రం తన అసంతృప్తి వ్యక్తం చేశారు. 'బీసీసీఐలో నా పాత్ర ముగిసింది. ఇందులో క్షమాగుణం ఏమీ ఉండదు. బీసీసీఐని వదిలి నన్ను వెళ్లిపోమని సుప్రీం ఆదేశించింది. అక్కడితో బీసీసీఐలో నా పాత్ర ముగిసింది. ఇంకేమీ ఉండదు కూడా' అని షిర్కే తెలిపారు. తనకు ప్రత్యేకమైన కోరికలు కూడా ఏమీ లేవని పేర్కొన్న షిర్కే.. బీసీసీఐలో కొత్తగా బాధ్యతలు స్వీకరించేవారు బాగా పరిపాలిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. బీసీసీఐతో తనకు వ్యక్తిగత సంబంధం ఏమీ లేదన్నారు. ఈ పదవిని వదిలేయడం వల్ల తనకు ఏమీ నష్టం ఉండదన్నారు. తనకు చాలా పనులున్నాయని, వాటిని చూసుకునే సమయం కూడా ఆసన్నమైందన్నారు. గతంలో తాను ఈ పదవిని చేపట్టేబోయే ముందు చాలా అభ్యంతరాలు వచ్చిన విషయాన్ని షిర్కే ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఇక బీసీసీఐతో తన అనుబంధం ముగిసిపోయిందని యూకేలో ఉన్న షిర్కే ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నారు. ధా కమిటీ సిఫారుసుల అమల్లో వెనకడుగు వేస్తూ వచ్చిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కు సుప్రీంకోర్టు దిమ్మ తిరిగే షాకిచ్చింది. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను తొలగిస్తూ సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించింది. ఈ కేసును ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన సుప్రీం.. సోమవారం ఎట్టకేలకు తుది తీర్పును ప్రకటించింది. లోధా కమిటీ సిఫారుసులను కచ్చితంగా అమలు చేయాల్సేందేనంటూ సుప్రీంకోర్టు పదే పదే చెప్పినా, వాటిని బోర్డు అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ మాత్రం సీరియస్‌గా తీసుకోలేదు. ప్రధానంగా కూలింగ్ ఆఫ్ పిరియడ్, ఒక రాష్ట్రానికి ఒకే ఓటు అనే లోధా సిఫారుసును వ్యతిరేకిస్తూ వచ్చారు. లోధా పేర్కొన్న కొన్ని సిఫారుసులను అమలు చేయడం కష్టసాధ్యమంటూ చెబుతూ వచ్చారు. దాంతో సుప్రీంకోర్టు ఎట్టకేలకు బీసీసీఐ కొరడా ఝుళిపించింది. ఈ మేరకు బోర్డులో ప్రధాన పదవుల్లో ఉన్న అనురాగ్, షిర్కేలను తొలగిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. -
ఐపీఎల్ లేనట్లేనా?
న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫారుసులు అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇప్పటికే ముందస్తు షెడ్యూల్లోని ఇంగ్లండ్ జట్టు పర్యటనకు ఖర్చులు భరించలేమని తేల్చి చెప్పిన బీసీసీఐ..వచ్చే ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) గురించి పూర్తి సందిగ్థంలో పడింది. ఆ లీగ్‌కు సంబంధించి పనిని ఇప్పటికే మొదలు పెట్టాల్సి ఉండగా, ప్రస్తుతం ఆ అంశాన్ని పక్కకు పెట్టింది. దీనిపై టైమ్స్ ఆఫ్ ఇండియాతో బీసీసీఐ సెక్రటరీ అజయ్ షిర్కే మాట్లాడుతూ.. అసలు వచ్చే ఏడాది ఐపీఎల్ జరుగుతుందా?లేదా?అనేది ఇంకా స్పష్టత లేదని పేర్కొనడం ఆ లీగ్ పరిస్థితి డైలమాలో పడినట్లు కనిపిస్తోంది. '2017ఐపీఎల్ జరుగుతుందా?లేదా?అనేది ఇంకా నాకైతే తెలీదు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే వచ్చే సీజన్ ఐపీఎల్ ప్రమాదంలో పడినట్లే. ఐపీఎల్ గురించి లోధా కోరిన వివరాలను ఆ కమిటీకి తెలియజేశాం. ఇంకా దానికి సంబంధించిన పని అయితే పెండింగ్‌లోనే ఉంది. ఐపీఎల్ నిర్వహించడానికి తీసుకోవాల్సిన ముందస్తు పనులకు సమయం కూడా లేదు. ఏమి జరగుతుందో నాకు పూర్తిగా తెలీదు' అని అజయ్ షిర్కే పేర్కొన్నారు. దాంతో పాటు బీసీసీఐ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితి చాలా దురదృష్టకరమన్నారు. -
లోధా ప్యానల్ వల్లే..
ముంబై:తమకు సుప్రీంకోర్టుకు మధ్య అపార్థాలు చోటు చేసుకోవడానికి లోధా కమిటీనే కారణమని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సెక్రటరీ అజయ్ షిర్కే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితికి లోధా కమిటీనే కారణమన్నాడు. అయితే లోధా ప్యానెల్ ప్రతిపాదనల అమలుకు తమకు కొన్ని నిర్ధిష్టమైన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు సూచించాలని షిర్కే పేర్కొన్నారు. ఆ రకంగా కోర్టు తమకు కొన్ని సూచనలు చేస్తే సాంకేతికంగా లోధా ప్రతిపాదనల్ని అమలు చేయడానికి ఆస్కారం ఉంటుందన్నారు. 'లోధా ప్యానల్ ప్రతిపాదనల అమలుపై కోర్టుపై గౌరంతోనే ఉన్నాం. మేము ఎక్కడికీ దూరంగా పారిపోవడం లేదు. వాటిని అమలు చేయడానికి మాకు ఎటువంటి భయం లేదు. కాకపోతే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులున్నాయి. వాటిని కోర్టుకు తెలియజెప్పాలని అనుకుంటున్నాం. ఈ విషయంలో కోర్టు సాయం కోరతాం' అని జాతీయ దినపత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెక్స్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో షిర్కే పేర్కొన్నారు. -
'మరింత పారదర్శకత తీసుకొస్తాం'
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)లో మరింత పారదర్శకతను తీసుకొస్తామని బోర్డు కార్యదర్శిగా ఎన్నికైన అజయ్ షిర్కే స్పష్టం చేశారు. బోర్డును సరైన దిశలో ముందుకు తీసుకువెళ్లడానికి ఏది ముఖ్యమో అది చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు షిర్కే పేర్కొన్నారు. ప్రస్తుత అధ్యక్షుడిగా ఎన్నికైన యువ అనురాగ్ ఠాకూర్ పరిపాలనలో ముందుకు సాగుతామన్నారు. అనురాగ్ యువకుడే కాకుండా, ఉత్సాహవంతుడు కావడంతో అందరీ అభిమానాన్ని చూరగొంటామన్నారు. 'అన్ని వివాదాలను అధిగమిస్తాం. బోర్డులో పారదర్శకత తీసుకొస్తే వివాదాలు సమసి పోతాయి. భారత క్రికెట్ కోచ్ పదవికి ప్రకటన ఇవ్వడం కూడా పారదర్శకతలో భాగమే' అని షిర్కే పేర్కొన్నారు. గతంలో బోర్డు కోశాధికారిగా పని చేసిన షిర్కే ఆదివారం కార్యదర్శిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. 2013 స్పాట్ ఫిక్సింగ్ వివాదం సమయంలో బీసీసీఐ స్పందన బాగా లేదంటూ షిర్కే తన పదవికి రాజీనామా చేశారు. ఈ అంశంపై తాజాగా స్పందించిన షిర్కే..అదొక చరిత్ర అంటూ వ్యాఖ్యానించారు.