న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫార్సుల అమలుపై బీసీసీఐ–సీఓఏ వాదనలను సుప్రీంకోర్టు జూలై 4కు వాయిదా వేసింది. సంస్కరణలకు సంబంధించి శుక్రవారమే సుప్రీం ఎదుట విచారణ జరగాల్సి ఉంది అయితే, మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమైన చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మే 15కు వాయిదా వేయాలని నిర్ణయించింది. ఆ రోజు తాను సెలవులో ఉంటానని కోర్టు సహాయకుడు (అమికస్ క్యూరీ) విన్నవించడంతో తేదీని జూలై 4కు మార్చింది. మరోవైపు లోధా కమిటీ సిఫార్సుల్లో నాలుగింటిని అమలు చేయలేమని 12 క్రికెట్ సంఘాలు స్పష్టం చేసిన సంగతి తెలిసింద
రూ.100 కోట్లు డిపాజిట్ చేయండి...
ఐపీఎల్ నుంచి కొచ్చి టస్కర్స్ కేరళ (కేటీకే) సస్పెన్షన్ కేసుకు సంబంధించి రూ.100 కోట్లు డిపాజిట్ చేయాల్సిందిగా బీసీసీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2011 సీజన్ సందర్భంగా ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు టస్కర్స్ యాజమాన్యాన్ని బీసీసీఐ రూ.156 కోట్లకు తాజాగా బ్యాంక్ గ్యారంటీ కోరింది. కేటీకే అలా చేయడంలో విఫలమవడంతో టస్కర్స్‌కు చెందిన రూ.156 కోట్ల విలువైన డిపాజిట్లను బీసీసీఐ స్వాధీనం చేసుకుంది. దీనిపై కొచ్చి టస్కర్క్ 2015లో ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించగా ఏడాదికి 18 శాతం వడ్డీతో రూ.550 కోట్లు చెల్లించమంటూ బీసీసీఐని ఆదేశించింది. అయితే బీసీసీఐ బాంబే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది. కేటీకే మళ్లీ అపెక్స్ కోర్టుకు వెళ్లగా జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలు శుక్రవారం దానికి అనుకూలంగా తీర్పునిచ్చారు. అందులో భాగంగానే రూ.100 కోట్లు డిపాజిట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
విచారణ జూలై 4కు వాయిదా
Published Sat, May 12 2018 1:03 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment