బీసీసీఐ, లోధా ప్యానెల్ కేసు విచారణ 14కు వాయిదా
బీసీసీఐ, లోధా ప్యానెల్ కేసు విచారణ 14కు వాయిదా
Published Sat, Dec 10 2016 1:41 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
న్యూఢిల్లీ: నూతన ప్రతిపాదనల అమలుపై జస్టిస్ ఆర్‌ఎం లోధా ప్యానెల్, బీసీసీఐ మధ్య సాగుతున్న విచారణ మరోసారి వారుుదా పడింది. వాస్తవానికి ఈనెల 5న ఈ విషయంలో సుప్రీంకోర్టు తుది తీర్పునివ్వాల్సి ఉండగా శుక్రవారానికి వాయిదా వేశారు. అరుుతే మరో కేసు విచారణ సుదీర్ఘంగా సాగడంతో ఈనెల 14కు బోర్డు, లోధా ప్యానెల్ కేసును వాయి
దా వేశారు.
చివరిసారిగా ఈ కేసు విచారణ అక్టోబర్ 21న జరిగింది. లోధా కమిటీ ప్రతిపాదనలను ఆయా రాష్ట్ర క్రికెట్ సంఘాలు అమలుపరిచే వరకు బోర్డు నుంచి ఎలాంటి నిధులు వెళ్లకూడదని ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బోర్డు ఆఫీస్ బేరర్లను తొలగించి పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లైను నియమించాలని ప్యానెల్ కోర్టుకు నివేదికను అందించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందోనని బోర్డు ఎదురుచూస్తోంది.
Advertisement
Advertisement