
ఐపీఎల్ హక్కులపై ఏం చేయాలి?
లోధా ప్యానెల్‌ను కోరిన బీసీసీఐ
న్యూఢిల్లీ: ఆర్థిక లావాదేవీల ప్రతిష్టంభనతో షాక్ తిన్న బీసీసీఐ ఇప్పుడు జాగ్రత్తగా తమ తదుపరి చర్యలు ఉండేలా చూసుకుంటోంది. ఈనేపథ్యంలో ఐపీఎల్ గ్లోబల్ మీడియా హక్కు (ప్రసార, ఇంటర్‌నెట్, మొబైల్ హక్కులు కలిపి)ల టెండర్ల విషయంలో ఎలా ముందుకెళ్లాలో సూచించాలంటూ లోధా ప్యానెల్‌కు బీసీసీఐ లేఖ రాసింది. టెండర్లను దాఖలు చేసేందుకు ఈనెల 25 ముగింపు తేదీ. సుప్రీం కోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పు ప్రకారం బీసీసీఐ ఆర్థిక వ్యవహారాలను, భారీ స్థారుు విలువ కలిగిన టెండర్లను పరిశీలించేందుకు ప్యానెల్ ఆడిటర్లను నియమించాల్సి ఉంది. అందుకే కార్యదర్శి అజయ్ షిర్కే లోధా ప్యానెల్‌ను సంప్రదించారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ సహా మొత్తం 18 కంపెనీలు టెండర్ డాక్యుమెంట్స్‌ను కొనుగోలు చేశారుు.