
రాష్ట్రపతికన్నానా వయస్సు తక్కువే!
విమర్శలపై నిరంజన్ షా వ్యంగ్యం
న్యూఢిల్లీ: లోధా ప్యానెల్ సూచించిన సంస్కరణల అమలుపై బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిటీలో ‘ప్రత్యేక ఆహ్వానితుడిగా’ 73 ఏళ్ల నిరంజన్ షాకు కూడా చోటు కల్పించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై షా ఘాటుగా స్పందించారు. ‘70 ఏళ్లకు పైగా వయస్సు కలిగిన వ్యక్తి మన దేశ రాష్ట్రపతి (ప్రణబ్ ముఖర్జీ, 81)గా సేవలందించవచ్చు..
కానీ బీసీసీఐ పరిపాలకులు మాత్రం ఆ వయస్సు లోపలే ఎందుకు ఉండాలి? అంతకు మించి వయస్సు ఉంటే వచ్చే నష్టమేముంది. ఎవరైనా సరే ఫిట్‌గా ఉంటే ఆఖరి శ్వాస వరకు సమర్థంగా పనిచేయవచ్చు’ అని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం మాజీ అధ్యక్షుడు షా స్పష్టం చేశారు.