Niranjan Shah
-
అందుకు పుజారా సరిపోడా?
న్యూఢిల్లీ: ఇటీవల క్రికెట్ పరిపాలక కమిటీ(సీఓఏ) ఖరారు చేసిన ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్‌లో చతేశ్వర్ పుజారాకు ‘ఎ ప్లస్’ గ్రేడ్ దక్కకపోవడాని బీసీసీఐ మాజీ సెక్రటరీ నిరంజన్ షా తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో పుజారాకు న్యాయం జరగలేదనేది బహిరంగంగానే కనబడుతోందంటూ సీఓఏపై మండిపడ్డారు. ఈసారి పుజారాను ‘ఎ ప్లస్’ గ్రేడ్‌లో చూస్తానని తాను బలంగా అనుకున్నానని, కానీ అది జరగకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యానని సౌరాష్ట్రకు సుదీర్ఘ కాలం సెక్రటరీగా పనిచేసిన నిరంజన్ పేర్కొన్నారు. ‘2018-19కి గాను ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో పుజారాకు ‘ఎ ప్లస్’ గ్రేడ్ దక్కడ పోవడం నిజంగా బాధాకరం. ఇది పూర్తి పారదర్శకతతో ఖరారు చేసిన జాబితా కాదు. ఇక్కడ సీఓఏ టెస్టులకు అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదనడానికి ఇదే నిదర్శనం. పుజారాకు ‘ఎ ప్లస్’ గ్రేడ్‌లో చోటుకు అన్ని విధాల అర్హుడు. గ్రేడ్లు కేటాయించేటప్పుడు టెస్టుల్లో ఆట తీరు ర్యాంకులు ఆధారంగా చేసుకోవాలి. మరి అటువంటప్పుడు పుజారాకు ‘ఎ ప్లస్’ గ్రేడ్ ఎందుకు దక్కలేదు’ అని నిరంజన్ షా ప్రశ్నించారు. ప్రస్తుతం పుజారా ‘ఎ’ గ్రేడ్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో పుజారా కీలక పాత్ర పోషించాడు. మూడు సెంచరీల సాయంతో 521 పరుగులు చేసి భారత్ సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకోవడంలో ముఖ్య భూమిక వహించాడు. బీసీసీఐ గ్రేడింగ్‌లో గత ఏడాదే చేర్చిన ‘ఎ ప్లస్’ గ్రేడ్ అన్నింటికంటే అత్యుత్తమం. రూ. 7 కోట్లు లభించే ఈ జాబితాలో గత ఏడాది ఐదుగురు ఆటగాళ్లు ఉన్నారు. అయితే వీరిలో మూడు ఫార్మాట్లలో రెగ్యులర్‌గా ఉన్న కెప్టెన్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రాలను మాత్రమే ఉంచి ఈసారి భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్‌లను తప్పించారు. కాగా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు బీసీసీఐనుంచి తగిన గుర్తింపు లభించింది. అతనికి ‘ఎ’ గ్రేడ్ ఖరారు చేశారు. -
మత సామరస్యం వెల్లివిరిసె..
అచ్చంపేట: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన జాతరల్లో రంగాపూర్ ఒకటి. మత సామరస్యానికి దర్పణం పట్టే అతిపెద్ద రెండో ఉర్సు నిరంజన్ షావలీ. ఈ నెల 17న రాత్రి నుం చి వారం రోజుల పాటు వైభవంగా జరుగుతా యి. అచ్చంపేట మండలం రంగాపూర్‌లో జరిగే ఉర్సుకు నల్లమల ప్రజలకు ప్రత్యేక సంబరాలు. హిందూ, ముస్లిం తేడా లేకుండా ఉర్సుకు జిల్లా నలుమూలల నుంచే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటారు. ఏటా లక్షన్నర మందికిపైగా భక్తులు పాల్గొంటారు. భక్తులు కందూరు చేసి మేకలు, గొర్రెలను బలి ఇస్తుంటారు. ఉర్సు రంగాపూర్గా పిలవబడుతున్న ఈ దర్గా వద్ద భక్తులు ఉత్సవాల సమయంలోనే కాక వివిధ రోజుల్లో దర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అమ్రాబాద్ మండలం ప్రజలు ఏ శుభకార్యం చేసినా మొదట కొండపై ఉన్న దర్గాను దర్శించుకుని తమ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దర్గా చరిత్ర 600ల ఏళ్ల క్రితం ఆరబ్దేశాల నుంచి అజ్మీర్‌లో స్థిరపడిన హజ్రత్ ఖాజాగరీబ్ నవాస్, ఢిల్లీలో స్థిరపడిన నిజామోద్దీన్ ఔలియా శిఘ్యలు ఇస్లాం మత ప్రచారంలో భాగంగా కాలినడకన తెలంగాణ ప్రాంతానికి వచ్చాడు. వారిలో ఐదుగురు ప్రముఖులు ఉన్నారు. అందులో హజ్రత్ నిరంజన్‌షావలీ(సయ్యద్ మహమూద్షాఖాద్రి) రంగాపూర్లోను, మరొకరు కొండపై హజ్రత్ బహావోద్దీన్షాఖాద్రిగా స్ధిరపడ్డారు. అలాగే నల్లగొండ జిల్లా జాన్పాడ్ సైదులుగా మరొకరు కొత్తూరు ఇన్ముల్ నర్వ వద్ద జేపీ పీర్లుగా, నిజామాబాద్‌లోని షాహదుల్లా హుస్సేన్, భువనగిరి జమాల్బహాద్లనే పేర్లతో స్థిరపడినట్లు ముస్లిం మతపెద్దలు చెప్పుకుంటున్నారు. ఇస్లాం మత ప్రచార నిమిత్తం నల్లమల ప్రాంతానికి వచ్చిన నిరంజన్‌షావలీ రంగాపూర్‌లో, మన్ననూర్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో బహావోద్దీన్షా కొండ మూల మలుపు వద్ద స్థిరపడ్డారు. వారి మరణాంతరం అక్కడ దర్గాను నిర్మించారు. అ కాలం నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతవాసులు దర్గాలో ఉర్సు నిర్వహిస్తున్నారు. గంధోత్సవం అచ్చంపేటలోని నారాయణప్రసాద్ ఇంటి నుంచి గంధాన్ని తీసుకెళ్లడం అనవాయితీ. 17న రాత్రి అచ్చంపేట మహబుబ్స్వామి దర్గాతో పాటు మన్ననూర్, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, ఉప్పునుంతల, బొమ్మనపల్లి, పెనిమిళ్ల, నాగర్‌కర్నూల్, తెల్కపల్లి, కొల్లాపూర్, వనపర్తి, మహబూబ్‌నగర్ ప్రాంతాల నుంచి గంధాన్ని ఊరేగింపుగా తీసుకొస్తారు. బొమ్మనపల్లి నుంచి గంధాన్ని గుర్రంపై తీసుకురావడం ప్రత్యేక ఆకర్షణ. గ్రామాల నుంచి బయలుదేరిన గంధోత్సవాలు అర్ధరాత్రి వరకు రంగాపూర్‌కు చేరుకుంటాయి. అన్ని ప్రాంతాల నుంచి గంధోత్సవాలు చేరుకోగానే భక్తులు నత్యాలు చేస్తూ వేడుకల్లో పాల్గొంటారు. మరుసటి రోజునుంచి ఉర్సు కొనసాగుతుంది. ఉమామహేశ్వర క్షేత్ర సందర్శన రంగాపూర్‌కు 5కిలోమీటర్ల దూరంలో కొండపై వెలసిన ఉమామహేశ్వర క్షేత్రాన్ని దర్గా దర్శనం అనంతరం భక్తులు సందర్శించడం అనవాయితీ. ఉర్సుకు మూడు రోజుల ముందే ఉమామహేశ్వర క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉర్సుకు వచ్చిన భక్తులు కులమత భేదాలు లేకుండా ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మత సామరస్యానికి దర్పణం పట్టే ఈ రెండు ఉత్సవాలు ఒకేసారి ముగుస్తాయి. ప్రత్యేక బస్సులు రంగాపూర్ నిరంజన్ షావలీ ఉర్సు, ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాల సందర్భంగా అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అచ్చంపేట–రంగాపూర్ వరకు 25ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. అచ్చంపేట–రంగాపూర్– ఉమామహేశ్వర కొండపైకి ఆరు మినీ బస్సులను నడుపుతున్నారు. హైదరాబాద్–అచ్చంపేట, నాగర్‌కర్నూల్–అచ్చంపేట, వనపర్తి, కొల్లాపూర్–అచ్చంపేటకు బస్సులు నడిపిస్తున్నట్లు డీఎం నారాయణ తెలిపారు. -
రాష్ట్రపతికన్నానా వయస్సు తక్కువే!
విమర్శలపై నిరంజన్ షా వ్యంగ్యం న్యూఢిల్లీ: లోధా ప్యానెల్ సూచించిన సంస్కరణల అమలుపై బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిటీలో ‘ప్రత్యేక ఆహ్వానితుడిగా’ 73 ఏళ్ల నిరంజన్ షాకు కూడా చోటు కల్పించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై షా ఘాటుగా స్పందించారు. ‘70 ఏళ్లకు పైగా వయస్సు కలిగిన వ్యక్తి మన దేశ రాష్ట్రపతి (ప్రణబ్ ముఖర్జీ, 81)గా సేవలందించవచ్చు.. కానీ బీసీసీఐ పరిపాలకులు మాత్రం ఆ వయస్సు లోపలే ఎందుకు ఉండాలి? అంతకు మించి వయస్సు ఉంటే వచ్చే నష్టమేముంది. ఎవరైనా సరే ఫిట్‌గా ఉంటే ఆఖరి శ్వాస వరకు సమర్థంగా పనిచేయవచ్చు’ అని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం మాజీ అధ్యక్షుడు షా స్పష్టం చేశారు. -
రాష్ట్రపతికి ఓ రూల్.. మాకో రూలా?
న్యూఢిల్లీ:లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలు అమలులో భాగంగా నూతనంగా ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటైన అనంతరం బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్ షా తన స్వరాన్ని పెంచుతూ కొత్త లాజిక్ ను తెరపైకి తీసుకొచ్చారు. ప్రధానంగా 70 ఏళ్ల పైబడిన వారు బీసీసీఐ, దాని అనుబంధ సంస్థల్లో ఉండరాదన్న లోధా కమిటీ సిఫారుసును నిరంజన్ తీవ్రంగా తప్పుబట్టారు. భారత దేశ రాష్ట్రపతులుగా 70 ఏళ్లు పైబడిన వారు ఉండొచ్చు కానీ బీసీసీఐలో పనిచేసే వారికి అంత వయసు ఉండకూడదన్ననిబంధన ఏమిటని ప్రశ్నించారు. ఇక్కడ రాష్ట్రపతికి ఒక రూల్.. మాకో రూలా? అంటూ నిలదీశారు. 'బీసీసీఐ ఆఫీస్ బేరర్లకు వయసులో పరిమితి ఏమిటో అర్ధం కావడం లేదు. మన ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వయసు చూడండి 81ఏళ్లు. ఆయన 70 ఏళ్లు కంటే తక్కువే ఉన్నారా. లేరు కదా. అటువంటప్పుడు బీసీసీఐలో పనిచేసేవారికి వయసులో నిబంధన విధించడం ఏమిటి. మనం ఫిట్ గా ఉంటే ఎంతకాలమైనా పని చేయవచ్చు. ఇది కచ్చితంగా ఒక రకమైన వివక్షే అని షా మండిపడ్డారు.