రషీద్‌ ఖాన్‌ అన్నయ్య సైతం.. | Not Just Rashid Khan, His Elder Brother Is A Spin Maestro As Well | Sakshi
Sakshi News home page

రషీద్‌ ఖాన్‌ అన్నయ్య సైతం..

Published Fri, Jun 22 2018 11:06 AM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM

Not Just Rashid Khan, His Elder Brother Is A Spin Maestro As Well - Sakshi

అఫ్గానిస్తాన్‌ యువ సంచలన రషీద్‌ ఖాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో తనదైన శైలిలో చెలరేగిపోతూ ‘టాప్‌’ బ్యాట్స్‌మెన్‌కి కొరకరాని కొయ్యగా మారిన రషీద్‌ ఖాన్‌.. దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్నాడు. మరొకవైపు టీ 20 ర్యాంకింగ్స్‌లో నం‍బర్‌ వన్‌ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంచితే, తన పెద్ద అన్నయ్య అమీర్‌ ఖాన్‌ కూడా స్పిన్నరనే విషయాన్ని రషీద్‌ ఖాన్‌ అభిమానులకు తెలియజేశాడు.

ఈ మేరకు సోదరుడు అమీర్‌ స్పిన్‌ బౌలింగ్‌ వేస్తున్న వీడియోను రషీద్‌ తన ట‍్వీటర్‌ అకౌంట్‌లో షేర్‌ చేశాడు. ‘నేను సోదరులతో కలిసి క్రికెట్‌ను ఆరంభించా. ఇందులో నా పెద్ద అన్నయ్య అమీర్‌కు బంతిని టర్న్‌ చేసే నైపుణ్యం కూడా ఉంది’ అనే క్యాప్షన్‌ ఇచ్చిన రషీద్‌.. ఫ్యామిలీ లెగ్‌స్పిన్నర్స్‌ హ్యాష్‌ ట్యాగ్‌తో వీడియో పోస్ట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement