
నొవాక్ జొకోవిచ్
లండన్ : వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల టెన్నిస్ సింగిల్స్ విజేతగా సెర్బియా ఆటగాడు నొవాక్ జొకోవిచ్ నిలిచాడు. ఫైనల్లో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై 6-2, 6-2, 7-6 తేడాతో జొకోవిచ్ విజయం సాధించి తన కెరీర్‌లో మరో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. వరుసగా మూడు సెట్లలో నెగ్గి ప్రత్యర్థి అండర్సన్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వని జొకోకు.. కెరీర్‌లో తాజా గ్రాండ్‌స్లామ్ నాలుగో వింబుల్డన్ ట్రోఫీ. కాగా, 2011, 2014, 2015లలో సెర్బియా ప్లేయర్ జొకోవిచ్ వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మరోవైపు తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన అండర్సన్‌కు నిరాశే ఎదురైంది. ఈ దక్షిణాఫ్రికా టెన్నిస్ స్టార్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment