నైనాకు రూ.3 లక్షల నజరానా | Offering Naina Rs 3 lakh priced | Sakshi
Sakshi News home page

నైనాకు రూ.3 లక్షల నజరానా

Published Sun, Sep 21 2014 12:49 AM | Last Updated on Sun, Apr 7 2019 3:34 PM

నైనాకు రూ.3 లక్షల నజరానా - Sakshi

నైనాకు రూ.3 లక్షల నజరానా

సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా రాణిస్తున్న టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (సాట్స్) సత్కరించింది. రాష్ట్ర సచివాలయంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి (రిటైర్డ్ ఐఏఎస్) ఆమెకు రూ. 3 లక్షల చెక్‌ను అందజేశారు.

పాకిస్థాన్‌లో గత నెల జరిగిన ఆసియా జూనియర్, క్యాడెట్ చాంపియన్‌షిప్‌లో ఆమె ఒక్కో స్వర్ణ, రజతం గెలిచింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నజరానాను అందజేసింది. చదువుల్లో, క్రీడల్లో రాణిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుతెచ్చుకున్న నైనాను లవ్ అగర్వాల్, రమణాచారిలు ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆమె తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement