
భారత్ బోణీ
విశాఖపట్నం, న్యూస్‌లైన్: స్పిన్నర్ గౌహర్ సుల్తానా (4/8) మాయాజాలం... కెప్టెన్ మిథాలీ రాజ్ (59 బంతుల్లో 6 ఫోర్లతో 34 నాటౌట్) రాణింపు... వెరసి శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఇక్కడి వైఎస్‌ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 39.3 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది.
లంక జట్టులో యశోద మెండిస్ (17) టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతా బ్యాట్స్‌విమెన్ రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. హైదరాబాద్ అమ్మాయి గౌహర్ సుల్తానా 8 ఓవర్లలో 4 మెయిడెన్లు వేసి 4 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకోవడం విశేషం. జులన్ గోస్వామి రెండు వికెట్లు పడగొట్టగా... నిరంజన, రాజేశ్వరి గైక్వాడ్, స్నేహ రాణా ఒక్కో వికెట్ తీశారు. 77 పరుగుల లక్ష్యాన్ని భారత్ 32.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. కరుణ జైన్ (6), స్మృతి (13) విఫలమవ్వగా... అనఘా దేశ్‌పాండే (2 ఫోర్లతో 23) రాణించింది.