Burevi Cyclone: ఉత్తర శ్రీలంకపై ‘బురేవీ’ ప్రభావం - Sakshi
Sakshi News home page

ఉత్తర శ్రీలంకపై ‘బురేవీ’ ప్రభావం 

Published Thu, Dec 3 2020 4:35 PM | Last Updated on Thu, Dec 3 2020 5:28 PM

Impact Of Burevi Cyclone In Northern Sri Lanka - Sakshi

సాక్షి, విశాఖపట్నం: దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళ తీరాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. ఉత్తర శ్రీలంకపై  గత ఆరు గంటలలో 11 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి లాట్ సమీపంలోని మన్నార్ గల్ఫ్ వద్ద బురేవీ తుపాను కేంద్రీ కృతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మన్నార్‌కు పశ్చిమ-వాయువ్య దిశలో 30 కి.మీ, పంబస్‌కు తూర్పు-ఆగ్నేయంలో 40 కి.మీ, కన్యాకుమారికి తూర్పు-ఈశాన్యంగా 260 కి.మీ. దూరంలో ఉందని తెలిపింది. (చదవండి: 2022 కల్లా తూర్పు నావిక దళంలోకి ‘విక్రాంత్‌’)

దక్షిణ తమిళనాడు తీరం పంబన్, కన్యాకుమారి మధ్య నేడు రాత్రి, రేపు  తెల్లవారు జామున సైక్లోనిక్ తుపానుగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ సమయంలో  70-80 కి.మీ  వేగంతో బలంగా గాలులు వీచే అవకాశం ఉందని, దక్షిణ తమిళనాడు తీరప్రాంత జిల్లాలతో పాటు రామనాథపురం, కన్యాకుమారి జిల్లాలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. (చదవండి: తీరం దాటినా.. తుపాన్‌గానే..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement