weathaer report
-
ఏపీకి భారీ వర్ష సూచన 4 జిల్లాలకు రెడ్ అలెర్ట్
-
తెలంగాణ:నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వేసవి తాపం నుంచి కాస్త చల్లబడ్డ రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సౌరాష్ట్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. మధ్య మహారాష్ట్ర, ఉత్తర లోతట్టు కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటకకు విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. సోమవారం నుంచి రాష్ట్రంలో పొడివాతావరణం ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం, కొన్నిప్రాంతాల్లో అంతకంటే తక్కువగా నమోదవుతున్నాయి. కాగా, సోమవారం నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. నల్లగొండలో గరిష్ట ఉష్ణోగ్రత 40.0 డిగ్రీల సెల్సియస్, అలాగే ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 21.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల మేర తక్కువగా నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
చల్లటి కబురు.. ఏపీలో బారి వర్షం
-
బురేవీ తుపాను: పొంచి ఉన్న ముప్పు..
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళ తీరాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఉత్తర శ్రీలంకపై గత ఆరు గంటలలో 11 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి లాట్ సమీపంలోని మన్నార్ గల్ఫ్ వద్ద బురేవీ తుపాను కేంద్రీ కృతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మన్నార్‌కు పశ్చిమ-వాయువ్య దిశలో 30 కి.మీ, పంబస్కు తూర్పు-ఆగ్నేయంలో 40 కి.మీ, కన్యాకుమారికి తూర్పు-ఈశాన్యంగా 260 కి.మీ. దూరంలో ఉందని తెలిపింది. (చదవండి: 2022 కల్లా తూర్పు నావిక దళంలోకి ‘విక్రాంత్’) దక్షిణ తమిళనాడు తీరం పంబన్, కన్యాకుమారి మధ్య నేడు రాత్రి, రేపు తెల్లవారు జామున సైక్లోనిక్ తుపానుగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ సమయంలో 70-80 కి.మీ వేగంతో బలంగా గాలులు వీచే అవకాశం ఉందని, దక్షిణ తమిళనాడు తీరప్రాంత జిల్లాలతో పాటు రామనాథపురం, కన్యాకుమారి జిల్లాలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. (చదవండి: తీరం దాటినా.. తుపాన్‌గానే..) -
తమిళనాడుకు పొంచి ఉన్న ముప్పు..
సాక్షి, చెన్నై: ఈశాన్య రుతు పవనాలు బుధవారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా వాతావరణం మారింది. ఈ ఏడాది నైరుతి ప్రభావం రాష్ట్రంలో తక్కువే. కేరళ, కర్ణాటకల్లో కురిసిన వర్షాలకు ఇక్కడి జలాశయాలు నిండాయి. ఈ పరిస్థితుల్లో ఈశాన్య రుతుపవనాల రూపంలో రాష్ట్రంలో వర్షాలు ఆశాజనకంగానే ఉంటాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో బుధవారం ఈ పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారింది. సముద్ర తీర జిల్లాల్లో వర్షం పడడం, వాతావరణం పూర్తిగా మారింది. అండమాన్‌కు సమీపంలో బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడడం, ఈశాన్య రుతుపవనాల రాక వెరసి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడనున్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది సరాసరి వర్షపాతం ఈ పవనాల రూపంలో నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
మళ్లీ వాయుగుండం
సాక్షి, హైదరాబాద్: తూర్పు మధ్య అరేబియా సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సౌరాష్ట్రకు దక్షిణ దిశగా, ముంబై నగరానికి పశ్చిమ వాయవ్య దిశగా ఈ వాయుగుండం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. దీని ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వివరించింది. ఈ వాయుగుండం ప్రభావం రానున్న 48గంటల పాటు కొనసాగి క్రమంగా బలహీనపడే అవకాశముందని పేర్కొంది. కాగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈనెల 19న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఇది తదుపరి 24 గంటల్లో బలపడనుందని హెచ్చరించింది. -
19న బంగాళాఖాతంలో అల్పపీడనం..
సాక్షి, హైదరాబాద్: మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ఏర్పడిన 24 గంటల తర్వాత తీవ్ర అల్పపీడ నంగా మారే అవకాశముందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో నేడు, రేపు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం ఉత్తర మహారాష్ట్ర తీరానికి దగ్గరలోని తూర్పు మధ్య అరేబియా సముద్రం, సమీప ప్రాం తాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఉత్తర మహారాష్ట్ర– దక్షిణ గుజరాత్ తీరాలకు దగ్గరలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. కాగా, కోస్తాంధ్ర, తెలంగాణ, ఉత్తర మహారాష్ట్ర తీరానికి దగ్గరలో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు తెలిపింది. -
24 గంటల్లో ‘నైరుతి’ వెనక్కి
సాక్షి, హైదరాబాద్: వచ్చే 24 గంటల్లో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ మొదలు కానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ రాజస్తాన్, పరిసర ప్రాంతాల్లో ఇందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లు తెలి పింది. జూన్ రెండో వారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నైరుతి ప్రభా వంతో దాదాపు మూడున్నర నెలలపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి వర్షాలు కురవడంతో 90 శాతానికి పైగా చెరువులు నిండాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థి తులు ఏర్పడటంతో సోమవారా నికల్లా ఇవి పశ్చిమ రాజస్తాన్, పరిసర ప్రాంతాల్లో నిష్క్రమించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 107 సెం.మీ. వర్షపాతం.. వర్షాకాలంలో తెలంగాణ వ్యాప్తంగా 70.7 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఈసారి ఏకంగా 107.0 సెంటీమీటర్ల మేర వర్షం కురిసినట్లు వాతా వరణ శాఖ వెల్లడించింది. జూన్ రెండో వారంలో రుతుపవనాలు ప్రవేశించగా... అప్పట్నుంచి ప్రతి నెలలో కూడా సాధారణ వర్ష పాతం కంటే అధికంగా వానలు కురిశాయి. ఆగస్టు, సెప్టెంబర్ లలో సాధారణం కంటే రెట్టింపు వానలు కురవడంతో రికార్డు స్థాయిలో ప్రాజెక్టులు నిండి గేట్లు తెరుచుకున్నాయి. గతేడాదిఇదే సీజన్లో కేవలం 77.6 సెంటీమీటర్ల వర్షం కురిసి సాధారణ వర్షపాతాన్ని నమోదు చేసింది. కొనసాగుతున్న ఉపరితల ద్రోణి... దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది తూర్పు బిహార్, దాన్ని ఆనుకొని ఉన్న సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్ వైపు కొనసాగుతోంది. అదేవిధంగా సిక్కింలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు పశ్చిమ బెంగాల్, కోస్తా ఒడిశా మీదుగా సుమారు 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులపాటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు. -
తీవ్ర వాయుగుండం.. భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా పరిసరాల్లో తీవ్ర వాయుగుండం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జంషెడ్‌పూర్‌కు ఆగ్నేయంగా 140 కిలోమీటర్ల దూరంలో, కియాంజిర్గఢ్కు 130 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఈశాన్య దిశగా వాయుగుండం కేంద్రీకృతమైంది. రాగల 24 గంటల్లో పశ్చిమ దిశగా పయనిస్తూ క్రమేణా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తా, తెలంగాణలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు గాని, వర్షం గాని కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది. గడచిన 24 గంటల్లో సోంపేట, కళింగపట్నంలో ఒక్కో సెంటీమీటరు చొప్పున వర్షపాతం నమోదైంది. -
పొంచి ఉన్న మరో అల్పపీడనం ముప్పు
చెన్నై: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు తీరప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాని సూచించింది.ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 1,579 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే చెన్నై కోలుకుంటుంది. సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతలోనే మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.