
సాక్షి, చెన్నై: ఈశాన్య రుతు పవనాలు బుధవారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా వాతావరణం మారింది. ఈ ఏడాది నైరుతి ప్రభావం రాష్ట్రంలో తక్కువే. కేరళ, కర్ణాటకల్లో కురిసిన వర్షాలకు ఇక్కడి జలాశయాలు నిండాయి. ఈ పరిస్థితుల్లో ఈశాన్య రుతుపవనాల రూపంలో రాష్ట్రంలో వర్షాలు ఆశాజనకంగానే ఉంటాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో బుధవారం ఈ పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారింది. సముద్ర తీర జిల్లాల్లో వర్షం పడడం, వాతావరణం పూర్తిగా మారింది. అండమాన్‌కు సమీపంలో బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడడం, ఈశాన్య రుతుపవనాల రాక వెరసి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడనున్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది సరాసరి వర్షపాతం ఈ పవనాల రూపంలో నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment