30 మందితో ఒకేసారి... చెస్ గేమ్‌లు ఆడిన హరికృష్ణ
బెల్‌గ్రేడ్: సెర్బియాలోని బెల్‌గ్రేడ్ యూనివర్సిటీ ‘వీక్ ఆఫ్ చెస్’ కార్యక్రమంలో భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గురువారం ఒకేసారి 30 మందితో అతను చెస్ గేమ్‌లు ఆడటం విశేషం. సుమారు ఐదు గంటల పాటు సాగిన ఈ 30 గేమ్‌లలో 26 మందిపై హరికృష్ణ విజయం సాధించగా, నలుగురు మాత్రమే భారత గ్రాండ్‌మాస్టర్‌తో తమ గేమ్‌లను ‘డ్రా’గా ముగించగలిగారు. సెర్బియాలో భారత రాయబారిగా ఉన్న నరీందర్ చౌహాన్ దీనిని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా భారత సంస్కృతి, ఆహారపు అలవాట్లు తదితర అంశాలపై ప్రత్యేక ప్రదర్శన కూడా జరిగింది. 2727 ఫిడే రేటింగ్‌తోప్రపంచ ర్యాంకింగ్స్‌లో 23వ స్థానంలో కొనసాగుతున్న హరికృష్ణ...ప్రస్తుతం వివిధ లీగ్ టీమ్ చాంపియన్‌షిప్‌లలో పాల్గొంటున్నారు.