కొలంబో: పాకిస్తాన్ ఆల్‌రౌండ్ షో ముందు ఆతిథ్య శ్రీలంక జట్టు పూర్తిగా తేలిపోయింది. సర్ఫరాజ్ అహ్మద్ (74 బంతుల్లో 77; 7 ఫోర్లు), హఫీజ్ (64 బంతుల్లో 54; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలకు తోడు బౌలర్లు కూడా చెలరేగడంతో మూడో వన్డేలో పాకిస్తాన్ 135 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో పర్యాటక జట్టు 2-1 ఆధిక్యంతో కొనసాగుతోంది. నాలుగో వన్డే 22న జరుగుతుంది. ఆదివారం ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 316 పరుగుల భారీ స్కోరు సాధించింది.
కెప్టెన్ అజహర్ అలీ (59 బంతుల్లో 49; 4 ఫోర్లు), షెహజాద్ (54 బంతుల్లో 44; 4 ఫోర్లు), షోయబ్ మాలిక్ (29 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు), రిజ్వాన్ (22 బంతుల్లో 35; 2 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన లంక 41.1 ఓవర్లలో 181 పరుగులకు కుప్పకూలింది. తిరిమన్నె (67 బంతుల్లో 56; 4 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. యాసిర్ షాకు నాలుగు, అన్వర్, వసీంలకు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు 34వ ఓవర్‌లో స్టాండ్స్ నుంచి పాక్ ఫీల్డర్ వైపు ఓ అభిమాని రాయి విసరడంతో కలకలం రేగింది. కొద్దిసేపు మ్యాచ్‌ను నిలిపివేయడంతో పాటు ప్రేక్షకులందరినీ ఖాళీ చేయించాక ఆటను కొనసాగించారు.
పాకిస్తాన్ భారీ విజయం
Published Mon, Jul 20 2015 12:13 AM | Last Updated on Sat, Mar 23 2019 8:32 PM
Advertisement
Advertisement