
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు లైన్ క్లియర్
లాహోర్: టి-20 ప్రపంచ కప్లో పాల్గొనేందుకుగాను భారత్కు వచ్చేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు లైన్ క్లియరైంది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ మేరకు అనుమతి మంజూరు చేశారు. ఈ నెల 19న భారత్, పాకిస్తాన్‌ల మధ్య ధర్మశాలలో మ్యాచ్ జరగాల్సివుంది. కాగా ఈ మ్యాచ్కు భద్రత కల్పించలేమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కేంద్రానికి లేఖరాయడంతో అనిశ్చితి ఏర్పడింది. ఈ వేదికలోనే మ్యాచ్ జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పష్టం చేశారు.
సుదీర్ఘ విరామం తర్వాత పాక్ క్రికెట్ జట్టు భారత్కు వస్తోంది. ముంబైలో ఉగ్రవాద దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే ఆసియా కప్, ప్రపంచ కప్లలో ఇరు జట్లు పాల్గొనడం మినహా ద్వైపాక్షి సిరీస్లు ఆడటం లేదు.