సంజయ్ మంజ్రేకర్
చిరకాల ప్రత్యర్థి భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు నిజంగా ఇది తీపి కబురే. బ్యాటింగ్ విభాగంలో తంటాలు పడుతున్న ఈ జట్టు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పూర్తి స్థాయిలో విజృంభించింది. మొహమ్మద్ హఫీజ్, అహ్మద్ షహజాద్ రాణింపుతో గతంలోకన్నా వీరి బ్యాటింగ్ మెరుగైనట్టే. బౌలింగ్‌లో ఎలాగూ దూకుడు ఉంది. దీంతో ఇటీవలి ఆసియా కప్‌లా కాకుండా ఈసారి భారత్‌కు తగిన హెచ్చరిక జారీ చేసినట్టుగానే భావించాలి. అయితే ధోని సేనను ఇప్పటికీ ఫేవరెట్‌గానే భావించాల్సి ఉంటుంది. తమ చివరి 11 మ్యాచ్‌ల్లో పదింట్లో గెలిచిన భారత జట్టు ఒక్క ఓటమితో తేడాగా కనిపిస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఈ జట్టు ప్రమాదకరంగా కనిపించలేదు. ఆసియా కప్‌లో కనిపించిన జోరు ఇప్పుడు లేదు. ఒక్క టి20 మ్యాచ్‌లో ఓడిపోవడం పెద్ద విషయం కాదు.
కానీ మరీ 47 పరుగుల తేడాతో ఓడడం.. అదీ సొంతగడ్డపై అంటే దారుణమే. నిజానికి తమ బ్యాట్స్‌మెన్ ఆటతీరును క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్‌లో మాత్రం తప్పదు. నైపుణ్యత కలిగిన బ్యాట్స్‌మెన్‌ను గుర్తించాలి. అప్పుడే ఏ పిచ్‌పైనైనా భారత్ ప్రమాదకారిగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికి మాత్రం పాకిస్తాన్‌ను ఓడించేందుకు ప్రస్తుత జట్టు సరిపోతుంది.
పాక్‌కు ఈ జట్టు సరిపోతుంది
Published Sat, Mar 19 2016 1:05 AM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM
Advertisement
Advertisement