
పాకిస్థాన్ పై బాగా ఆడతాం: కోహ్లి
ఢాకా: ఏ జట్టుతో ఆడిన తన ఆటతీరు మారదని టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి అన్నాడు. పాకిస్థాన్ ఆడినప్పుడు కూడా సహజమైన శైలిలోనే ఆడతానని, ఎటువంటి భేదం చూపబోనని చెప్పాడు. ఆసియా కప్ టి20 టోర్నీలో భాగంగా బుధవారం జరిగే మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో టీమిండియా తలపడనుంది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లి మంగళవారం ఢాకాలో విలేకరులతో మాట్లాడాడు.
అన్ని జట్లను ఒకేలా చూస్తామని, ప్రతి జట్టుపైనా బాగా ఆడాలని కోరుకుంటామని చెప్పాడు. ఆటగాళ్ల సామర్థ్యంపై నమ్మకం ఉంచడం చాలా కీలకమని పేర్కొన్నాడు. మైదానంలోకి దిగాక ప్రత్యర్థి జట్లపై పైచేయి సాధించేందుకు బాగా ఆడాలని అనుకుంటామని, పాకిస్థాన్ టీమ్ తో ఆడినప్పుడు కూడా అదేవిధమైన పట్టుదల ప్రదర్శిస్తామని తెలిపాడు. పాకిస్థాన్ బలమైన జట్టు అని పేర్కొన్నాడు. ఈనెల 27న భారత్- పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.