పాకిస్తాన్‌ గెలిచింది... | Pakistan win by 49 runs to knock South Africa out of Cricket World Cup 2019 | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ గెలిచింది...

Published Mon, Jun 24 2019 3:47 AM | Last Updated on Mon, Jun 24 2019 5:28 AM

Pakistan win by 49 runs to knock South Africa out of Cricket World Cup 2019 - Sakshi

ఇంగ్లండ్‌ గడ్డపై దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌ ప్రస్థానం లీగ్‌ దశలోనే ముగిసింది. ఇప్పటి వరకు ఒకటే విజయంతో సరిపెట్టుకున్న సఫారీ ఐదు మ్యాచ్‌ల్లో ఓడింది. దీంతో సెమీస్‌ అవకాశాల్ని పూర్తిగా కోల్పోయింది. మరోవైపు పాకిస్తాన్‌ జట్టు ఎట్టకేలకు రెండో విజయాన్ని సాధించింది. ముందుగా బ్యాట్స్‌మెన్, తర్వాత బౌలర్లు సమష్టిగా కదం తొక్కడంతో దక్షిణాఫ్రికాను తేలిగ్గానే కంగుతినిపించింది.

లండన్‌: పాకిస్తాన్‌ జట్టు సమష్టి శ్రమతో దక్షిణాఫ్రికాను బోల్తా కొట్టించింది. ఆదివారం జరిగిన పోరులో పాకిస్తాన్‌ 49 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 308 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హరిస్‌ సొహైల్‌ (59 బంతుల్లో 89; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), బాబర్‌ ఆజమ్‌ (80 బంతుల్లో 69; 7 ఫోర్లు) రాణించారు.  తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసి ఓడింది. డుప్లెసిస్‌ (79 బంతుల్లో 63; 5 ఫోర్లు), డికాక్‌ (60 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.  

ఓపెనర్ల శుభారంభం
పాక్‌కు ఓపెనర్లు ఇమామ్‌ ఉల్‌ హక్‌ (58 బంతుల్లో 44; 6 ఫోర్లు), ఫఖర్‌ జమాన్‌ (50 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభం అందించారు. కుదురుగా ఆడుతున్న ఓపెనర్లను ఇమ్రాన్‌ తాహిర్‌ ఔట్‌ చేశాడు. తర్వాత బాబర్‌ ఆజమ్, హఫీజ్‌ (20)లు కూడా బాధ్యతగా ఆడటంతో సఫారీ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. హఫీజ్‌ వెనుదిరిగాక వచ్చిన హరిస్‌ సొహైల్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. క్రీజ్‌లో పాతుకుపోయిన ఆజమ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 81 పరుగులు జోడించాడు. బాబర్‌ 61 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. జట్టు స్కోరు 224 పరుగుల వద్ద బాబర్‌ నిష్క్రమించగా, సొహైల్‌... ఇమాద్‌ వసీమ్‌ (23; 3 ఫోర్లు) కలిసి ఐదో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. ధాటిగా ఆడిన సొహైల్‌ 38 బంతుల్లో అర్ధశతకం సాధించాడు.

డుప్లెసిస్‌ మినహా...
ఆరంభంలోనే ఆమ్లా (2) ఔట్‌ కాగా... డికాక్, కెప్టెన్‌ డుప్లెసిస్‌ క్రీజులో ఉన్నంతసేపు దక్షిణాఫ్రికా గెలుపు మీద ఆశలు పెట్టుకుంది. వీళ్లిద్దరు పాక్‌ బౌలర్లను చక్కగా ఎదుర్కొన్నారు. రెండో వికెట్‌కు 87 పరు గులు జోడించారు.  డికాక్‌తో పాటు స్వల్ప వ్యవధిలో మార్క్‌రమ్‌ (7)ను స్పిన్నర్‌ షాదాబ్‌ ఔట్‌ చేశాడు. అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న డుప్లెసిస్‌ను ఆమిర్‌ పెవిలియన్‌ చేర్చాడు. 136 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయిన దక్షిణాఫ్రికా లక్ష్యానికి దూరమైంది.

స్కోరు వివరాలు
పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: ఇమామ్‌ (సి అండ్‌ బి) తాహిర్‌ 44; ఫఖర్‌ (సి) ఆమ్లా (బి) తాహిర్‌ 44; బాబర్‌ (సి) ఇన్‌గిడి (బి) ఫెలుక్‌వాయో 69; హఫీజ్‌ ఎల్బీడబ్ల్యూ (బి) మార్క్‌రమ్‌ 20; సొహైల్‌ (సి) డికాక్‌ (బి) ఇన్‌గిడి 89; ఇమాద్‌ (సి) సబ్‌–డుమిని (బి) ఇన్‌గిడి 23; రియాజ్‌ (బి) ఇన్‌గిడి 4; సర్ఫరాజ్‌ నాటౌట్‌ 2; షాదాబ్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 12;
మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 308.

వికెట్ల పతనం: 1–81, 2–98, 3–143, 4–224,
5–295, 6–304, 7–307.

బౌలింగ్‌: రబడ 10–0–65–0, ఇన్‌గిడి 9–0–64–3, మోరిస్‌ 9–0–61–0, ఫెలుక్‌వాయో 8–0–49–1, తాహిర్‌ 10–0–41–2, మార్క్‌రమ్‌ 4–0–22–1.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: ఆమ్లా ఎల్బీడబ్లూ (బి) ఆమిర్‌ 2; డికాక్‌ (సి) ఇమామ్‌ (బి) షాదాబ్‌ 47; డుప్లెసిస్‌ (సి) సర్ఫరాజ్‌ (బి ఆమిర్‌ 63; మార్క్‌రమ్‌ (బి) షాదాబ్‌ 7; డసెన్‌ (సి) హఫీజ్‌ (బి) షాదాబ్‌ 36; మిల్లర్‌ (బి) షాహిన్‌ 31;  ఫెలుక్‌వాయో నాటౌట్‌ 46; మోరిస్‌ (బి) రియాజ్‌ 16, రబడ (బి) రియాజ్‌ 3; ఇన్‌గిడి (బి) రియాజ్‌ 1; తాహిర్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 6;
మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 259.

వికెట్ల పతనం: 1–4, 2–91, 3–103, 4–136, 5–189, 6–192, 7–222, 8–239, 9–246.

బౌలింగ్‌: హఫీజ్‌ 2–0–11–0, ఆమిర్‌ 10–1–49–2, షాహిన్‌ 8–0–54–1, వసీమ్‌ 10–0–48–0, రియాజ్‌ 10–0–46–3, షాదాబ్‌ 10–1–50–3.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement