అదే స్పూర్తిని కలిగిస్తోంది: యువరాజ్ | Passion for game has brought me back: Yuvraj Singh | Sakshi
Sakshi News home page

అదే స్పూర్తిని కలిగిస్తోంది: యువరాజ్

Published Sun, Aug 25 2013 2:50 PM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM

అదే స్పూర్తిని కలిగిస్తోంది: యువరాజ్

అదే స్పూర్తిని కలిగిస్తోంది: యువరాజ్

క్రికెట్ ఆటపై ఉన్న వ్యామోహమే తిరిగి జట్టులోకి వచ్చేందుకు తనలో స్పూర్టిని కలిగిస్తోంది అని భారత డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ అన్నాడు. గత సంవత్సరం క్యాన్సర్ వ్యాధిని జయించిన యువరాజ్ జట్టులో చోటు సంపాదించాడు. అయితే దారుణ వైఫల్యం కారణంగా జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. 
దాంతో దేశవాళి క్రికెట్లో రాణించి మూడు ఫార్మాట్లలోనూ తిరిగి స్థానం సంపాదించేందుకు దృష్టిసారించానని  యువరాజ్  అన్నాడు. గత సంవత్సరం చాలా కష్టంగా గడించింది అని, జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయన్నారు. 
2011 ప్రపంచకప్ తర్వాత గాయాలు, క్యాన్సర్ వ్యాధి తనను వేధించింది అని యువరాజ్ తెలిపారు. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో రాణించకపోవడంతో జట్టు నుంచి స్థానం కోల్పోవాల్సి వచ్చిందన్నాడు. అయితే ఆటపై ఉన్న ఆసక్తి, వ్యామోహమే తిరిగి జట్టులోకి వచ్చేందుకు ప్రేరణ కల్పిస్తోందన్నాడు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement