ఇస్లామాబాద్: దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆండిల్ పెహ్లువాకియాపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ క్రికెటర్ సర్పరాజ్ అహ్మద్‌పై నాలుగు వన్డేల నిషేధం వేయడాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ఘటన తర్వాత సర్ఫరాజ్ బహిరంగంగా క్షమాపణలు చెప‍్పినప్పటికీ అతనిపై నాలుగు వన్డేల నిషేధం వేస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకోవడాన్ని ఆక్షేపించింది. ఇది అనాలోచిత చర్యగా పీసీబీ చీఫ్ ఇషాన్ మణి ఆరోపించారు.
ఇషాన్ మణి మాట్లాడుతూ.. ‘ ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై సర్ఫరాజ్ బహిరంగ క్షమాపణలు కోరాడు. ఇందుకు అంతా అంగీకరించారు. దక్షిణాఫ్రికా బోర్డుతో పాక్‌కి సత్సంబంధాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు దీనిని సీరియస్‌గా తీసుకోలేదు. ఐసీసీ మధ్యలోకి వచ్చి సర్ఫరాజ్ అహ్మద్‌పై చర్యలు తీసుకుంది. ఇక్కడ పెహ్లువాకియా వివరణ కూడా ఐసీసీ తీసుకోలేదు. ఈ క్రమంలో జాతి వివక్షల కింద సర్ఫరాజ్‌పై సస్పెన్షన్ వేయాల్సిన అవసరం ఏంటి?. వారేమీ స్కూల్ పిల్లలు కాదు’ అని ఇషాన్ మణి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment