రియో డి జనీరో: ఒలింపిక్స్ జరిగే నగరంలో క్రీడల సందడి విపరీతంగా ఉంటుంది. అందరూ స్టేడియాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ రియోలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడి వాళ్లు చేతిలో ఫోన్లు పట్టుకుని ‘గేమ్’ ఆడుతూ ఒలింపిక్స్‌ను పట్టించుకోవడం లేదు. దీనికి కారణం పోకెమాన్ గో. యువత అంతా చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకుని పోకెమాన్‌లను వెతికి పట్టుకునేందుకు వీధుల వెంబడి తిరుగుతున్నారే కానీ అత్యంత ప్రతిష్టాత్మక గేమ్స్ తమ దగ్గరే జరుగుతున్నాయనే ఆలోచనలో లేరు. గేమ్స్‌కు రెండు రోజుల ముందు బ్రెజిల్‌లో పోకెమాన్ గో ఆప్‌ను విడుదల చేశారు. అంతే.. క్రేజ్ తారాస్థాయికి చేరుకుంది. ఎంతలా అంటే.. రియో పార్క్ దగ్గర శనివారం వందలాది మంది తమ చేతిలో మొబైల్ ఫోన్లు పట్టుకుని ఇలాగే వెతుకుతూ కనిపించారు. రియోలో ఈ గేమ్‌ను 20 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్టు అంచనా.
పోకెమాన్ గో ‘గో..’
Published Mon, Aug 15 2016 1:54 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM
Advertisement
Advertisement