
స్టట్‌గార్ట్ (జర్మనీ): మెర్సిడెస్ కప్ టెన్నిస్ టోర్నీ తొలి రౌండ్‌లో సంచలన ప్రదర్శనతో ప్రిక్వార్టర్స్‌కు చేరిన భారత ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ రెండో రౌండ్‌లో ఓటమి పాలయ్యాడు. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 23వ ర్యాంకర్‌ను మట్టికరిపించిన ప్రజ్నేశ్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 75వ ర్యాంకర్ గిడో పెల్లా (అర్జెంటీనా) చేతిలో ఓటమి పాలయ్యాడు. గురువారం జరిగిన ఈ పోరులో ప్రజ్నేశ్ 6–7, 4–6తో గిడో పెట్టా చేతిలో ఓడాడు. కీలక సమయాల్లో పట్టు కోల్పోయిన ప్రజ్నేశ్ తిరిగి కోలుకోలేకపోయాడు. దీంతో క్వార్టర్స్‌లో టెన్నిస్ దిగ్గజం ఫెడరర్‌తో తలపడే అవకాశాన్ని కోల్పోయాడు.