
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సత్తా చాటింది. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో టైటిల్‌ను కైవసం చేసుకున్న ప్రాంజల సింగిల్స్ విభాగంలో మాత్రం రన్నరప్‌గా నిలిచింది.
శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో ప్రాంజల–రుతుజా భోస్లే (భారత్) ద్వయం 6–4, 6–1తో నటాషా–రిషిక సుంకర (భారత్) జోడీపై గెలుపొందింది. మరోవైపు సింగిల్స్ టైటిల్ పోరులో రెండో సీడ్ ప్రాంజల 5–7, 4–6తో టాప్ సీడ్ అనిట్డినోవా గోజల్ (కజకిస్తాన్) చేతిలో పరాజయం పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment