
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల సర్క్యూట్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ఆకట్టుకుంది. నవీ ముంబైలో జరిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో ఆమె రన్నరప్‌గా నిలిచింది.
టైటిల్ పోరులో ప్రాంజల (భారత్)–తమారా జిదాన్సెక్ (స్లొవేనియా) ద్వయం 0–6, 1–6తో రెండో సీడ్ జార్జినా గార్సియా పెరెజ్ (స్పెయిన్)–డయానా మార్సింకెవికా (లాత్వియా) జంట చేతిలో పరాజయం పాలైంది. అంతకుముందు సెమీస్‌లో ప్రాంజల జోడీ 6–4, 2–6, 13–11తో టాప్ సీడ్ ఓల్గా డోరోషినా (రష్యా)–పొలినా మోనోవా (రష్యా) జంటపై విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment